రాజా బాక్సాఫీస్ వద్ద రప్పాడించేస్తున్నాడే!
దాదాపు 12 ఏళ్ల క్రితం తీసిన సినిమా ఇప్పుడు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో ఆడటం అంటే చిన్న విషయం కాదు.
విశాల్ హీరోగా నటించిన `మదగజరాజా` ఇటీవల విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల క్రితం తీసిన సినిమా ఇప్పుడు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో ఆడటం అంటే చిన్న విషయం కాదు. ఆ రకంగా `మదగజరాజా` మంచి సక్సస్ సాధించిందని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ కి ముందు విశాల్ ప్రచారానికి హాజరైతే ఆయన ఆరోగ్యంపై ఎన్నో కథనాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత అతడు కోలుకోవడం ...సినిమా సక్సెస్ అవ్వడం వరుసగా కలిసొచ్చింది. ఈ చిత్రం ఇప్పటికే తమిళ నాడులో 25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కేవలం ఐదు రోజుల్లోనే 25 కోట్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ దూకుడు చూస్తుంటే 50 కోట్లు పెద్ద విషయం కాదు. లాంగ్ రన్ లో సినిమా 50 కోట్ల వసూళ్లుతో ముగిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ సంక్రాంతికి తమిళనాడులో సినిమాలేవి రిలీజ్ కాలేదు.
విశాల్ సినిమాతో పాటు కొన్ని సినిమాలున్నా అందులో `మదగజరాజా`కి పాజటివ్ టాక్ రావడంతో పాటు 12 ఏళ్ల క్రితం నాటి విశాల్ ను తెరపై చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించింది. విశాల్ అనారోగ్యం కూడా సినిమాపై కొంత సింపతీ కారణమైందన వాదన కూడా వినిపిస్తుంది. ఇలా సినిమాకి అన్ని రకాలుగా కలిసొచ్చింది. ఈ చిత్రాన్ని సుందర్ సి తెరకె క్కించగా జెమినీ ఫిల్మ్స్ -బెంజ్ మీడియా సంస్థలు నిర్మించాయి. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నుంచి పంఫిణీ అయింది.
ఇందులో సంతానం, అంజలి , వరలక్ష్మి శరత్ కుమార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో వీళ్లకి కూడా మంచి బూస్టింగ్ లభించింది. కోలీవుడ్ లో ఈ మధ్య కాలంలో వీళ్లు నటించిన సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. `గేమ్ ఛేంజర్` సినిమాలో అంజలి భాగమైంది. కానీ ఆ సినిమా ప్లాప్ టాక్ అమ్మడిని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆ సినిమా హిట్ అయితే రేంజ్ మరోలా ఉండేది.