స‌క్సెస్ కోసం పొర్లుదండాలు పెట్టిన హీరో!

ఈ సినిమా రిలీజ్ అయి 25 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఇటీవ‌ల రీ-రిలీజ్ కూడా చేసారు.

Update: 2024-11-28 14:30 GMT

సినిమా చేసిన త‌ర్వాత ఫ‌లితం కోసం హీరో ప‌రీక్ష రాసిన విద్యార్ధిలా ఎదురు చూస్తుంటాడు. ఫ‌లితం అనుకూలంగా ఉండాల‌ని ఈ మ‌ధ్య‌లో ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఆ ఫ‌లితం పాజిటివ్ గా వ‌స్తే సంతోషం లేదంటే దుఖం త‌ప్ప‌దు. తాజాగా మాధ‌వ‌న్ ఎదుర్కున్న‌ అనుభ‌వాన్ని కూడా పంచుకున్నాడు. మాధ‌వ‌న్ ఐకానిక్ మూవీ 'ర‌హ‌నా హై తేదే దిల్ మే' విష‌యాలు రివీల్ చేసారు. ఈ సినిమా రిలీజ్ అయి 25 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఇటీవ‌ల రీ-రిలీజ్ కూడా చేసారు.


`25 ఏళ్ల క్రిత తొలిసారి రిలీజ్ అయిన‌ప్పుడు పెద్ద స్పంద‌న ల‌భించ‌లేదు. దీంతో సినిమా ప్లాప్ అయింద‌ని అర్దైంది. అప్పుడే నా మ‌న‌సు ముక్క‌లైంది. ఈ సినిమా విజ‌యం సాధించాల‌ని మొక్కని దేవుడు లేడు. ఎక్క‌ని గుడి మెట్లు లేవు. అయినా సినిమా ప‌రాజ‌యం చెందేస‌రికి బాగా బాధ‌ప‌డ్డాను. దుఖం వ్చేసింది. ఎంతో మ‌నోవేద‌న‌కు గుర‌య్యాను. అప్పుడే అనిపించింది . ఏ దైనా రాసిపెట్టి ఉంటే త‌ప్ప‌! రాదు అని. అదృష్టం కూడా క‌లిసి రావాల‌ని అప్పుడే అనిపించింది.

కానీ పాతికేళ్ల త‌ర్వాత అదే సినిమా రిలీజ్ అయింది మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. ఇది నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. అప్పుడు డ‌బ్బులు రాలేదు. ఇప్పుడా పాత సినిమాని చూసి ప్రేక్ష‌కులు డ‌బ్బులివ్వ‌డం చూసి ఆశ్చ‌ర్యానికి గుర‌య్యాను. అప్పుడు ఎంత బాధ ప‌డ్డానో...ఇప్పుడు అంత‌కంటే ఎక్కువ‌గా సంతోషంగా అనిపిస్తుంది` అని అన్నారు. ఈసినిమా 2001 లోరిలీజ్ అయింది. గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన మిన్నాలే అనే త‌మిళ చిత్రానికి రీమేక్ ఇది.

ఇందులో మాధ‌వ‌న్ కి జోడీగా దియా మీర్జా న‌టించింది. ఆ సినిమాతోనే దియా బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది. సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర పోషించాడు. మాధ‌వ‌న్ కెరీర్ కూడా అప్పుడే ప్రారంభ‌మైంది. అప్ప‌టికే ఐదారు సినిమాలు చేసాడు. ఆ సినిమా త‌ర్వాతే కోలీవుడ్ లో మాధ‌వ‌న్ న‌టుడిగా బిజీ అయ్యాడు.

Tags:    

Similar News