ప్రియాంకకు చిన్నప్పటి నుంచే ఫాలోయింగ్ ఎక్కువంటోన్న మధు చోప్రా
ఆ క్రేజ్ ను వాడుకోవడానికే రాజమౌళి ఆమెను ఎస్ఎస్ఎంబీ29 కోసం తీసుకున్నాడు.;
ప్రియాంక చోప్రా క్రేజ్ గురించి, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్ కు వెళ్లిన ప్రియాంక చోప్రాకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రియాంక అంటే పడి చచ్చిపోయే అభిమానులు బయట లక్షల్లో ఉన్నారు. ఆ క్రేజ్ ను వాడుకోవడానికే రాజమౌళి ఆమెను ఎస్ఎస్ఎంబీ29 కోసం తీసుకున్నాడు.
అయితే ప్రియాంకకు ఈ క్రేజ్, ఫాలోయింగ్ హీరోయిన్ అయ్యాక వచ్చినవి కాదు. ప్రియాంక చిన్నప్పటి నుంచే ఎంతోమంది అబ్బాయిలు తన వెంట పడేవారని ప్రియంక తల్లి మధు చోప్రా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రియాంక చిన్నప్పటి నుంచి ఎన్నో ఛాలెంజెస్ ను దాటుకుని మరీ స్థాయికి వచ్చినట్టు ఆమె తల్లి మధు వెల్లడించారు.
చిన్నప్పుడు ప్రియాంక కొంతకాలం పాటూ యూఎస్ లో ఉండటం వల్ల తనకు అక్కడి కల్చర్ అలవాటైందని, అందులో భాగంగానే వెస్ట్రన్ డ్రెస్సులు ఎక్కువగా వేసుకోవడంతో తన కూతురిని చూడటానికి యూత్ మొత్తం ఎగబడేవారని, ఒక రోజు ఓ అబ్బాయి తమ ఇంటి గోడ కూడా దూకడంతో తామంతా భయపడి, వెంటనే ఇంటి చుట్టూ ఐరన్ రాడ్స్ తో ఫెన్సింగ్ వేయించినట్టు మధు చోప్రా తెలిపారు.
ఆ తర్వాత కొంతకాలం పాటూ ప్రియాంక వెస్ట్రన్ బట్టలన్నీ పక్కనేసి, సల్వార్ కమీజ్ లు వేసుకోవడం అలవాటు చేసుకుందని ప్రియాంక తల్లి చెప్పారు. అయితే ప్రియాంకకు దోస్తానా మూవీ షూటింగ్ టైమ్ లో విపరీతమైన జ్వరం రావడంతో షూటింగ్ కు వెళ్లొద్దని చెప్పానని, కానీ డైరెక్టర్ తరుణ్ అందుకు ఒప్పుకోకపోవడంతో పాటూ ప్రియాంక కచ్ఛితంగా షూటింగ్ కు రావాల్సిందేనని పట్టుబట్టారని, దాంతో తనకెంతో కోపమొచ్చి, షూటింగ్ కు వచ్చాక నా కూతురికి ఏమైనా అయితే నీదే బాధ్యత అని డైరెక్టర్ కు వార్నింగ్ కూడా ఇచ్చానని ఆ అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు మధు చోప్రా.
పాపులర్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని అమెరికాలోనే సెటిలైపోయి అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్న ప్రియాంక ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం మళ్లీ ఇండియన్ సినిమా వైపు చూసింది. ఈ సినిమా కోసం ప్రియాంక చాలా భారీ మొత్తంలో ఛార్జ్ చేస్తున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ప్రియాంక క్రేజ్ చూసి నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి సముఖంగానే ఉన్నారట.