అనిరుధ్ వల్ల ఆగిన ‘మ్యాజిక్’

కానీ, అతడి వల్ల ఓ తెలుగు సినిమా విడుదల ఆలస్యం అవుతుందని తాజాగా తెలిసింది.

Update: 2024-11-06 05:28 GMT

చాలా చిన్న వయసులోనే తనదైన శైలి సంగీతంతో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిపోయాడు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సంగీత దర్శకుడే అయినా.. చాలా భాషల్లో పని చేసి శ్రోతలను అలరిస్తున్నాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అనిరుధ్ పాన్ ఇండియా మ్యూజిక్ కంపోజర్‌గా మారిపోయాడు. దీంతో యమా బిజీగా గడుపుతున్నాడు.

ఇటీవలి కాలంలో భారీ బడ్జెట్ మూవీలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తోన్న అనిరుధ్ రవిచందర్.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాకు బెస్ట్ ఔట్‌పుట్‌నే ఇచ్చాడు. అలా ఈ చిత్రంలోని పాటలతో సోషల్ మీడియాను సైతం షేక్ చేశాడు. దీనికితోడు ఈ చిత్రానికి పవర్‌ఫుల్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను సైతం ఇచ్చాడు. తద్వారా నేషనల్ వైడ్‌గా మంచి పేరును మరోసారి దక్కించుకున్నాడు.

అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు ఇప్పుడు తమిళంలో ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’, ‘కూలీ’, ‘విడా ముయార్చీ’తో పాటు హిందీలో ‘కింగ్’.. తెలుగులో ‘మ్యాజిక్’ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వీటితో పాటు విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి చిత్రం, నాని - శ్రీకాంత్ ఓదెల మూవీలకు కూడా మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడు. వీటితో పాటు మరో ఆరేడు సినిమాలను అతడు లైన్‌లో పెట్టుకున్నాడు.

చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న అనిరుధ్ రవిచందర్ ఒక్కో దాన్ని కంప్లీట్ చేసుకుంటూ వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. కానీ, అతడి వల్ల ఓ తెలుగు సినిమా విడుదల ఆలస్యం అవుతుందని తాజాగా తెలిసింది. అదే.. గౌతమ్ తిన్ననూరి తెకెక్కిస్తోన్న ‘మ్యాజిక్’ అని సమాచారం. డిసెంబర్ 21న విడుదల కావాల్సిన సినిమా మ్యూజిక్ లేట్ అవడం వల్ల మళ్లీ వాయిదా పడబోతుందని తెలిసింది.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కొత్త వాళ్లతో చేస్తున్న చిత్రమే ‘మ్యాజిక్’. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు అనిరుధ్ సరైన సమయంలో మ్యూజిక్ కంపోజ్ చేయడంలో విఫలం అయ్యాడట. దీంతో ఈ చిత్రం మళ్లీ వెనక్కి జరిగినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ మ్యూజిక్ డైరెక్టర్‌పై విమర్శలు వస్తున్నాయి.

‘మ్యాజిక్’ సినిమా యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామాగా రాబోతుంది. అందుకే ఎంతో పేరున్న అనిరుధ్ రవిచందర్‌ను చిత్ర యూనిట్ సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకుంది. కానీ, ఇప్పుడు అదే ఆ చిత్రానికి సమస్యగా మారినట్లు ఫిలిం సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై అనిరుధ్ ఎలాంటి ప్లాన్ చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News