మహారాజా రీమేక్ వెనక అమీర్ మాస్టర్ మైండ్?
దీనికి కారణం వెస్ట్రన్ మూవీని ఇండియనైజ్డ్ కథగా మలచడంలో ఎదురైన వైఫల్యమే డిజాస్టర్ కి కారణమని విశ్లేషించారు.
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సుదీర్ఘ కెరీర్ లో నటించిన సినిమాలు చాలా పరిమిత సంఖ్యను కలిగి ఉన్నా, అతడి సక్సెస్ రేటు అసాధారణమైనది. అద్భుతమైన కంటెంట్ ని ఎలా ఎంపిక చేసుకుని పాన్ ఇండియాలో రీచ్ అవ్వాలో తెలిసిన గొప్ప పర్ఫెక్షన్ ఉన్న నటుడు -నిర్మాత. అతడి విజయాల వెనక యూనిక్ థాట్ ప్రాసెస్, గొప్ప కథలు ఉన్నాయి.
అయితే అమీర్ ఖాన్ నటించి స్వీయనిర్మాణంలో రూపొందించిన `లాల్ సింగ్ చడ్డా` (ఫారెస్ట్ గంప్ రీమేక్) దారుణమైన ఫ్లాప్‌ని చవి చూడటం అతడిని తీవ్రంగా నిరాశపరిచింది. దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించి, తీవ్రంగా మనసు పెట్టి భారీ బడ్జెట్ ని వెచ్చించి ఈ సినిమాని తెరకెక్కించారు అమీర్. కానీ బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫలితాన్ని అందుకుంది. దీనికి కారణం వెస్ట్రన్ మూవీని ఇండియనైజ్డ్ కథగా మలచడంలో ఎదురైన వైఫల్యమే డిజాస్టర్ కి కారణమని విశ్లేషించారు.
కేవలం అమీర్ ఖాన్ మాత్రమే కాదు ఇటీవలి కాలంలో చాలా సౌత్ సినిమాల రీమేక్‌లు బాలీవుడ్ లో వచ్చి దారుణ వైఫల్యాలను చవి చూసాయి. ఇటీవలే అక్షయ్ నటించిన రీమేక్ మూవీ సర్ఫిరా (ఆకాశం నీ హద్దురా రీమేక్) బాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం ఫాలైంది. వీటన్నిటి ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఇప్పుడు ఏదైనా దక్షిణాది సినిమాని హిందీలో రీమేక్ చేయాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది.
అయితే ఇలాంటి సమయంలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ దక్షిణాదిన హిట్టయిన మహారాజా సినిమాని హిందీలో రీమేక్ చేయబోతున్నారంటూ కథనాలొస్తున్నాయి. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మహారాజా సౌత్ లో గొప్ప ఆదరణ పొందినా నార్త్ ఆడియెన్ హిందీ రీమేక్ ని ఆదరిస్తారా? అంటూ సందిగ్ధతలను వ్యక్తం చేస్తున్నారు. అయితే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మైండ్ లో ఏం ఉంది? ఇది కేవలం నార్త్ ఆడియెన్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని తాను ప్రధాన పాత్రలో రూపొందించాలని అనుకుంటున్నారా? లేక దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ తరహాలో చైనా భాషలోను రిలీజ్ చేసి విజయం సాధించాలనే వ్యూహం ఏదైనా దాగి ఉందా? అనేది ఎవరికీ తెలియని రహస్యం. దంగల్ భారత్ కంటే చైనాలో పెద్ద విజయం సాధించింది. సీక్రెట్ సూపర్ స్టార్ అదే ఫలితాన్ని అందించింది. అందుకే అతడి ఆలోచనలు చైనా మార్కెట్ చుట్టూ ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతానికి మహారాజా రీమేక్ ఆలోచన సరైనదా కాదా? అనేది కేవలం చర్చ మాత్రమే. కేవలం మహారాజా కథను హిందీ ఆడియెన్ ని మాత్రమే దృష్టి లో పెట్టుకుని రీమేక్ చేయడం సరికాదని భావించినా ఇతర భాషలను దృష్టిలో పెట్టుకుని అమీర్ రీమేక్ ఆలోచన చేస్తున్నారని కూడా ఊహిస్తున్నారు. ఇప్పటికే దీనిని ఓటీటీలోను విస్త్రతంగా ప్రేక్షకులకు చేరువ చేసారు కాబట్టి యథాతథంగా రీమేక్ కాకుండా దీనిని నవ్యపంథా కథనంతో అమీర్ ఖాన్ తెరకెక్కిస్తారని ఒక సెక్షన్ ఊహాగానాలు సాగిస్తున్నారు.