1 నేనొక్క‌డినే కోసం సూప‌ర్‌స్టార్ సాహ‌సం

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన సినిమాల్లో కొన్ని సినిమాలు ఫ్లాపైనా వాటికి ఒక స్పెష‌ల్ క్రేజ్ ఉంటుంది.;

Update: 2025-04-04 19:30 GMT
1 నేనొక్క‌డినే కోసం సూప‌ర్‌స్టార్ సాహ‌సం

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన సినిమాల్లో కొన్ని సినిమాలు ఫ్లాపైనా వాటికి ఒక స్పెష‌ల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి సినిమాల్లో ఖ‌లేజా, 1 నేనొక్క‌డినే సినిమాలుంటాయి. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 1 నేనొక్క‌డినే సినిమా చాలా రిచ్ గా ఉంటుంది. ఆ సినిమా చాలా డిఫ‌రెంట్ గా కూడా ఉంటుంది. 1 నేనొక్క‌డినే మూవీ లో మ‌హేష్ లుక్స్, మ‌హేష్ కొడుకు గౌత‌మ్ క్యామియో, సుకుమార్ స్క్రీన్ ప్లే, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆ సినిమాకు స్పెష‌ల్ ఫ్యాన్ బేస్ ఏర్ప‌డేలా చేశాయి.

ఈ సినిమా కోసం మ‌హేష్ బాబు ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ సుకుమారే స్వ‌యంగా చెప్పాడు. అంతేకాదు, ఈ మూవీ కోసం మ‌హేష్ నిజంగానే ఓ స్టంట్ కూడా చేశాడట‌. విల‌న్ గ్యాంగ్ నుంచి త‌ప్పించుకోవ‌డానికి మ‌హేష్ బాబు ఓ సీన్ లో స్పీడ్ బోట్ తీసుకుని స‌ముద్రంలోకి వెళ్తాడు. మ‌హేష్ ను వెంబ‌డిస్తూ మరికొంద‌రు కూడా అత‌న్ని ఫాలో అవుతుంటారు.

మ‌హేష్ త‌ప్ప ఆ సీన్ లో న‌టించిన అంద‌రూ ప్రొఫెష‌న‌ల్ స్విమ్మ‌ర్లే. పైగా వారంద‌రూ లైఫ్ జాకెట్లు వేసుకుని మ‌రీ వెళ్తారు. కానీ మ‌హేష్ బాబు మాత్రం నార్మ‌ల్ డ్రెస్ లోనే వెళ్లిపోతాడు. దానికి తోడు మ‌హేష్ కు స్విమ్మింగ్ అంతంత మాత్రమే వ‌చ్చ‌ట‌. అంతేకాదు, ఓ ప్రొఫెష‌న‌ల్ బోట్ డ్రైవ‌ర్ స్పీడ్ బోట్ ను ఎంత స్పీడ్‌తో డ్రైవ్ చేస్తాడో దాన్ని మ‌హేష్ అలానే డ్రైవ్ చేశాడ‌ని ఆ సీన్ చేసేట‌ప్పుడు మ‌హేష్ తో పాటూ చిత్ర యూనిట్ కూడా చాలా క‌ష్ట‌ప‌డింద‌ని సుకుమార్ గ‌తంలో ఓ సంద‌ర్భంలో చెప్పాడు.

ఎంతో క‌ష్ట‌ప‌డి తీసిన సినిమా ఫ్లాపైంద‌ని ఇప్ప‌టికీ తాను బాధ‌ప‌డుతుంటాన‌ని చెప్పిన సుకుమార్, అన‌వ‌స‌రంగా హిట్ అయ్యే సినిమాను ఫ్లాప్ చేశానే అనిపిస్తుంద‌ని, మొద‌ట ఒక వెర్ష‌న్ అనుకుని నిర్మాత‌కు చెప్పాన‌ని అది అత‌నికి కూడా బాగా న‌చ్చింద‌ని, కానీ సెట్స్ పైకి వెళ్లాక తాను ఎమోష‌న‌ల్ సైడ్ వెళ్లడంతో క‌థ మొత్తం మారిపోయింద‌ని, ఆడియ‌న్స్ కు క‌న్ఫ్యూజ‌న్ బాగా పెరిగింద‌ని సుకుమార్ తెలిపాడు.

మ‌రో రెండు సీన్స్ తీసి, ఎడిటింగ్ విష‌యంలో జాగ్ర‌త్త ప‌డితే 1 నేనొక్క‌డినే ఫ్లాప్ అవ‌కుండా ఉండేదని సుకుమార్ చెప్పాడు. అయిన‌ప్ప‌టికీ ఈ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను కూడా అందుకుంది. ఇంత గొప్ప స్క్రీన్ ప్లే ఎలా రాశార‌ని అప్ప‌ట్లో సుకుమార్ ను అంద‌రూ మెచ్చుకున్నారు కూడా. కానీ సినిమా మాత్రం ఆడియ‌న్స్ కు అర్థం అవ‌కపోవ‌డంతో ఫ్లాప్ గా నిలిచింది.

Tags:    

Similar News