ఎల్లాయిడ్ మహేష్ లుక్.. మొత్తం లీక్ అయినట్టేగా..!

స్టార్ హీరోలు మిగతా దర్శకులతో సినిమా చేయడం వేరు రాజమౌళితో సినిమా చేయడం వేరు అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది.;

Update: 2025-04-14 04:41 GMT
Mahesh Babu Breaks Rajamoulis Rules

స్టార్ హీరోలు మిగతా దర్శకులతో సినిమా చేయడం వేరు రాజమౌళితో సినిమా చేయడం వేరు అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వేరే డైరెక్టర్ తో అయితే ఆ హీరోలు షూట్ గ్యాప్ లో ఏవైనా చేసుకోవచ్చు. కానీ రాజమౌళి ఆ ఛాన్స్ ఇవ్వడు. అంతేకాదు తన సినిమాలో హీరో గెటప్, లుక్ ని బయట లీక్ కాకుండా జాగ్రత్త పడతాడు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాల టైం లో ఈ జాగ్రత్తలు తీసుకున్న జక్కన్న మహేష్ సినిమాకు మాత్రం అలాంటి కండీషన్స్ ఏమి పెట్టలేదన్నట్టు తెలుస్తుంది.

మహేష్ పాస్ పోర్ట్ ని తీసుకుని అతన్ని తన కంట్రోల్ చేస్తున్నట్టుగా ఒక వీడియో వదిలిన రాజమౌళి సినిమా పూర్తయ్యే వరకు ఆ పాస్ పోర్ట్ మహేష్ కి ఇవ్వడని అనుకోగా ఈమధ్యనే మహేష్ ఎయిర్ పోర్ట్ లో తన పాస్ పోర్ట్ చూపిస్తూ వెకేషన్ కి వెళ్లాడు. అంతేకాదు సినిమాలో మహేష్ లుక్ దాదాపు తెలిసిపోయింది. పొడవాటి జుట్టు, గడ్డంతో మహేష్ కొత్తగా కనిపిస్తునాడు.

ఐతే సినిమాలో రాజమౌళి మహేష్ ని ఎలా చూపిస్తాడో కానీ ఓ వైపు రాజమౌళి సినిమా చేస్తున్నా కూడా మహేష్ యాడ్స్ చేయడం మాత్రం మాంట్లేదు. ఆల్రెడీ మౌంటైన్ డ్యూ కోసం మహేష్ తన అగ్రిమెంట్ కొనసాగిస్తుండగా దాని కోసం రీసెంట్ గా ఒక యాడ్ చేశాడు. ఇక కొత్తగా కూతురు సితారతో కలిసి ట్రెండ్స్ యాడ్ చేశాడు. ఇప్పుడు మహేష్ బ్రాండింగ్ చేస్తున్న ఎల్లాయిడ్ ఏసీ కోసం కొత్త ప్రకటనలో కనిపించాడు.

తమన్నాతో కలిసి మహేష్ చేసిన ఈ యాడ్ చూస్తే రాజమౌళి సినిమాలో మహేష్ లుక్ దాదాపు లీక్ అయినట్టుగానే ఉంది. ఐతే రాజమౌళి మహేష్ కోసం ఒక మంచి క్యారెక్టరైజేషన్ తీర్చిదిద్దుతున్నాడు కాబట్టి సిల్వర్ స్క్రీన్ పై ఆ లెక్క వేరే ఉంటుందని అంటున్నా మహేష్ లుక్ మొత్తం లీక్ అవ్వడంపై ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. ఐతే ఇందులో మరో ఇన్నర్ పాయింట్ ఏంటంటే మహేష్ ఈ లుక్ తో కొన్ని ప్రకటనలతో కనిపిస్తే కాస్త అలవాటు పడతారు అన్నట్టుగా కూడా రాజమౌళి ప్లాన్ లో భాగమే అని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా మహేష్ ఏం చెప్పి రాజమౌళిని ఒప్పించాడో కానీ సినిమాలు రాకపోయినా యాడ్స్ తో అయినా ఈ రెండేళ్లు ఫ్యాన్స్ ఖుషి అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Full View
Tags:    

Similar News