మహేష్ కొత్త లుక్.. ఈ హాలీవుడ్ స్టార్ స్ఫూర్తి?
అంతేకాదు SSMB29 లుక్ కి 'జాన్ విక్' స్టార్ కీనూ రీవ్స్ స్ఫూర్తి! అంటూ ఒక నెటిజన్ ఎక్స్ ఖాతాలో కీనూ ఫోటోతో మహేష్ బాబు ఫోటోని జోడించి పోలిక చెప్పారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త లుక్ టాలీవుడ్ సర్కిల్స్ సహా అభిమానుల్లో బిగ్ డిబేట్ గా మారింది. మహేష్ లుక్ కి స్ఫూర్తి ఫలానా హాలీవుడ్ స్టార్! అంటూ కొందరు నెటిజనులు సోషల్ మీడియాల్లో పోస్టులు పెడుతున్నారు. ఈ లుక్ పై రకరకాల థియరీలు పుట్టుకొచ్చాయి. ఎవరికి వారు మహేష్ బాబు లుక్ పై మీమ్స్ తో సరదాగా స్పందిస్తుండడం మరింత ఉత్కంఠ పెంచుతోంది.
అంతేకాదు SSMB29 లుక్ కి 'జాన్ విక్' స్టార్ కీనూ రీవ్స్ స్ఫూర్తి! అంటూ ఒక నెటిజన్ ఎక్స్ ఖాతాలో కీనూ ఫోటోతో మహేష్ బాబు ఫోటోని జోడించి పోలిక చెప్పారు. నిజమే.. మహేష్ కొత్త గెటప్ ఇంచుమించు అలానే ఉంది. కీనూ రీవ్స్ ఇటీవల ఒక కొత్త హెయిర్ స్టైల్ తో అభిమానులను అలరించారు. భారీ యాక్షన్ చిత్రం 'జాన్ విక్'లో అతడి రూపం పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు రాజమౌళి- మహేష్ బాబు బృందం దీనిని ఇష్టపడ్డారా? మహేష్ న్యూలుక్ కి అతడే ప్రేరణ అనుకోవాలా? అంటూ ఒకటే చర్చ మొదలైంది. కీనూ రీవ్స్ లుక్ మ్యాట్రిక్స్ ఫ్రాంఛైజీలో అల్టిమేట్ గా ఉంటుంది. కీనూ స్టైలిష్ లుక్, అద్భుతమైన నట ప్రదర్శనకు మతి చెడుతుంది. జాన్ విక్ లోను అతడు చాలా వేగం ఉన్న హీరోగా కనిపించాడు. అందుకే మహేష్ బాబు అతడి స్ఫూర్తితో అదే రూపంతో కనిపిస్తుంటే ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు.
కొందరు అభిమానులు అయితే... మహేష్‌ని మరో లెవల్లో పొగిడేస్తున్నారు. బాలీవుడ్‌ని విడిచిపెట్టి, హాలీవుడ్‌కు చెందిన వ్యక్తి కూడా సూపర్‌స్టార్ మహేష్ బాబుకు దగ్గరగా లేరు! #మహేష్‌బాబు ది బెస్ట్! అని వ్యాఖ్యానించారు. కీనూ రీవ్స్ ఫోటోని చూపిస్తూ 'ఎవడ్రా జాన్ విక్ (నాకు కళ్ళు బానే ఉన్నాయ్)' అంటూ స్పందించారు. నిజానికి మహేష్ బాబు ఫేవరెట్ స్టార్ టామ్ క్రూజ్. అతడి రూపం, డ్రెస్సింగ్ సెన్స్ ని మహేష్ అమితంగా ఇష్టపడతారు. కానీ ఇప్పుడు కీనూ రీవ్స్ లుక్ ని ట్రై చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. ఒక పాపులర్ హాలీవుడ్ స్టార్ తో మహేష్ బాబును పోలుస్తున్నారంటే, అతడు తన కొత్త సినిమా కోసం తీసుకుంటున్న శ్రద్ధను ప్రశంసించాలి. మహేష్ తన లుక్ మేకోవర్ కోసం జిమ్ లో కఠినంగా శ్రమిస్తున్నారు. ఫిజికల్ గాను అతడు మరింత ఫిట్ గా మారారు. మహేష్ - రాజమౌళి మూవీ ప్రారంభోత్సవం, రెగ్యులర్ చిత్రీకరణ ఇంకా ఎప్పుడు? అన్నది ఉత్కంఠగా మారింది. జస్ట్ వెయిట్ అండ్ సీ...