నిజమైన మగాడు అంటే..? సూపర్‌స్టార్ డెఫినిషన్!
ఆయన చెప్పినది సాంప్రదాయ మూస ఆలోచనా విధానానికి తూట్లు పొడుస్తోంది.
మగాడు అంటే మీనింగ్? మీసం తిప్పేవాడు.. కండలు పెంచేవాడు.. శత్రువును మట్టి కరిపించేవాడు! అవునా...! అయితే అలా ఆలోచించే వాళ్లకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కనువిప్పు కలిగించారు. నిజమైన మగతనానికి అర్థం ఏమిటో మహేష్ తన మాటల ద్వారా చెప్పారు. ఆయన చెప్పినది సాంప్రదాయ మూస ఆలోచనా విధానానికి తూట్లు పొడుస్తోంది.
ఇతరులను గౌరవించడం.. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం అసలైన పురుష లక్షణమని మహేష్ బాబు అన్నారు. చేసే పనిలో సానుకూల ధృక్పథాన్ని కలిగిన వాడు, సమానత్వం కోసం పోరాడేవాడు సిసలైన మగాడు అని కూడా అన్నారు. #రియల్ మర్డ్ (మెన్ ఎగైనిస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్) అని హ్యాష్ ట్యాగ్ ని ప్రచారం చేసారు ఎంబీ.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు శక్తివంతమైన మార్డ్ కవితను ఆవిష్కరించారు. ఆయనతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో కం దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ కూడా మర్డ్ కవిత ద్వారా ఒక శక్తివంతమైన కథనాన్ని ఆవిష్కరించారు. ఇది మగతనాన్ని పునర్నిర్వచించే ఆలోచనను రేకెత్తించే నివాళి. సాంప్రదాయ లింగ మూస పద్ధతులను సవాలు చేయడానికి ఉద్దేశించిన ఈ పద్యం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఆ ఇద్దరు స్టార్లు గౌరవం, సానుభూతి, సమానత్వం వంటి ఆలోచనలను ఆధునిక పురుషత్వ నిజమైన లక్షణాలుగా నొక్కిచెప్పారు.
ప్రస్తుతం సోషల్ మీడియాల్లో #రియల్‌మార్డ్.. # అంతర్జాతీయ పురుషుల దినోత్సవం వంటి హ్యాష్ ట్యాగుల్ని ప్రమోట్ చేసిన స్టార్లు మోడ్రన్ మస్కులినిటీని పునర్నిర్వచించటానికి మర్డ్ అఫీషియల్‌తో నాతో చేరండి అని స్టార్లు కోరారు. ఫర్హాన్ అక్తర్ దీనిని ఇనిషియేట్ చేయడమే కాకుండా, తన తండ్రి, లెజెండరీ జావేద్ అక్తర్ రాసిన కవితకు తన గాత్రాన్ని అందించాడు. ఆయన కూడా ఇవే భావాలను కలిగి ఉన్నారు. అతడు తన పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చాడు. “@MardOfficial మేము లింగ-సమానత్వ భవిష్యత్తును ఊహించాము. ఈ #అంతర్జాతీయ పురుషుల దినోత్సవం, పురుషత్వాన్ని సమగ్రత, దయ, గౌరవంగా పునర్నిర్వచించాలనే మా ప్రయత్నంలో మీరూ చేరండి.. అని పిలుపునందించారు. MARD కవిత - ఇప్పుడు 5 భాషల్లో ప్రసారం అవుతోంది.
మార్డ్ చొరవ - ఇది మాన్ ఎగైనెస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్ - లింగ సమానత్వం గురించి అవగాహన పెంచడానికి .. గౌరవం, సానుభూతి తాలూకా విలువలను రూపొందించడం ద్వారా పురుషులను ప్రోత్సహించడానికి సృష్టించినది. ఈ పదునైన కవిత ద్వారా పురుషత్వానికి నిజమైన అర్థం చెప్పడం వారి ఉద్ధేశం. మార్డ్ పోయెమ్‌లో సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, షాన్, ఫర్హాన్ అక్తర్ ల అద్భుతమైన సహకారం ఉంది.