మహేష్ మాయతో ముఫాసా మాస్ జాతర

అయితే మహేష్ బాబు సినిమాలకు పెద్ద అడ్డా అయిన హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో ముఫాసా బెనిఫిట్ షోను 20వ తేదీ ఉదయం 8 గంటలకు వేయబోతున్నారు.

Update: 2024-12-16 14:21 GMT

ది లయన్ కింగ్.. ఈ హాలీవుడ్ మూవీకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీ నుంచి ముఫాసా మూవీ ప్రేక్షకుల ముందుకు డిసెంబర్ 20వ తేదీన రానుంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు సహా అనేక భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

అయితే తెలుగు వెర్షన్ కు గాను సినిమాలోని మెయిన్ క్యారెక్టర్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్.. సినీ ప్రియులను ఓ రేంజ్ లో మెప్పించింది.

దీంతో సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ కేవలం డబ్బింగే చెప్పారు కదా.. కనిపించరు కదా.. మరి ఎందుకంత ఎదురుచూపులు అంటుంటే.. మహేష్ నెక్ట్స్ మూవీ రావడానికి మరో రెండేళ్లు టైమ్ పడుతుందని, అందుకే ఇప్పుడు ఎంజాయ్ చేస్తామని చెబుతున్నారు.

మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళితో చేయాల్సిన సినిమాతో బిజీగా ఉన్నారు. తన రోల్ కోసం మేకోవర్ అవుతున్నారు. ఇప్పుడు విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. SSMB 29 కంప్లీట్ అవ్వడానికి రెండేళ్ల టైమ్ కచ్చితంగా పడుతుంది. అందుకే ఇప్పుడు ముఫాసా సినిమా ద్వారా ఆయన వాయిస్ ను వింటామని చెబుతున్నారు.

అదే సమయంలో తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ రోజు ఎలా రచ్చ చేస్తారో.. ఇప్పుడు ముఫాసాకు కూడా అలాగే చేయాలని మహేష్ ఫ్యాన్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బ్యానర్లు, కేక్ కటింగ్స్, డీజేలు, డప్పులు, బాణసంచా.. అలా అన్నీ అరేంజ్ చేస్తున్నారని వినికిడి. పెద్ద పెద్ద కటౌట్లు కూడా వివిధ థియేటర్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారని సమాచారం.

అయితే మహేష్ బాబు సినిమాలకు పెద్ద అడ్డా అయిన హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో ముఫాసా బెనిఫిట్ షోను 20వ తేదీ ఉదయం 8 గంటలకు వేయబోతున్నారు. అందుకు సంబంధించిన టికెట్లకు వేరే లెవెల్ లో డిమాండ్ ఉందట. మొత్తానికి బొమ్మల సినిమా ముఫాసాకు మహేష్ బాబు ఫ్యాన్స్ మామూలు సందడి చేయడం లేదన్నమాట. మరి ఆ మూవీ.. సినీ ప్రియులను ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News