ఇంకా యాడ్ షూట్ లోనే మహేష్.. జక్కన్న ప్రాజెక్ట్ ఏమైనట్లు?
కళ్లజోడుతో మోడ్రన్ లుక్‌లో కూల్‌గా కనిపిస్తున్న ఆయన, తన వయస్సును తక్కువగా చూపించేలా మెయింటైన్ చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన తాజా లుక్‌తో సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో యాడ్ షూట్ చేస్తూ కనిపించారు. సాధారణంగా మహేష్ బాబు మినిమమ్ గ్యాప్ లోనే సినిమాలైనా, యాడ్స్ అయినా పూర్తిచేసే వ్యక్తి. రాజమౌళి దర్శకత్వంలో ఆయన సినిమా షూటింగ్ మొదలయ్యే సమయంలో ఇలా యాడ్ షూట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల రాజమౌళి SSMB29 సినిమా పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేశారని టాక్ వచ్చింది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో పూజా జరిగిన మాట వాస్తవమే అయినా ఎక్కడా కూడా అఫీషియల్ క్లారిటీ అయితే రాలేదు. ఈ నేపథ్యంలో ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైందా లేదా అన్నది ఇంకా తెలియడం లేదు. ఇక మహేష్ యాడ్ షూట్‌లో బిజీగా కనిపించడం అభిమానుల్లో మరీంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది.
సాధారణంగా రాజమౌళి సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు హీరోలు ఇతర ప్రాజెక్టుల్లో పాల్గొనడం జరగదు. లుక్ లీక్ కాకూడదని యాడ్స్ కూడా చేయరు. బహుశా రాజమౌళి షూటింగ్ ఇంకా స్టార్ట్ అయ్యి ఉండకపోవచ్చు, వర్క్‌షాప్ కోసం మహేష్ ఇంకా వేచి ఉన్నారేమోనని టాక్ వస్తోంది. ఇక ఫొటోలో మహేష్ ఆకుపచ్చ రంగు టీ-షర్ట్, సింపుల్ స్టైల్‌లో కనిపించారు.
కళ్లజోడుతో మోడ్రన్ లుక్‌లో కూల్‌గా కనిపిస్తున్న ఆయన, తన వయస్సును తక్కువగా చూపించేలా మెయింటైన్ చేస్తున్నారు. ఈ లుక్ చూసి అభిమానులు సూపర్ కామెంట్స్ చేస్తున్నారు. "మహేష్ ఏ వయసులోనైనా స్టైలిష్‌గా కనిపిస్తారన్నది మరోసారి నిరూపితమైంది," అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చే సినిమాలు నెమ్మదిగా కానీ, భారీ స్థాయిలో రూపొందుతాయని తెలిసిందే. మహేష్ పాత్ర కోసం పలు ప్రీపరేషన్స్ జరుగుతున్నట్లు సమాచారం.
అయితే, షూటింగ్ ఫుల్ ఫేజ్‌లోకి వెళ్లక ముందు మహేష్ ఇలా యాడ్ షూట్ చేస్తూ అదనపు ఆదాయాన్ని అందుకుంటున్నారని తెలుస్తోంది. యాడ్స్‌లో మహేష్‌కి భారీ రెమ్యూనరేషన్ లభిస్తుందనే విషయం తెలిసిందే. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా భారీ స్థాయిలో తెరకెక్కనుంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ లో ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీగా రూపొందించనున్నట్లు టాక్. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు ఇంతకు మించిన పాపులారిటీ సాధిస్తారని అంచనా వేస్తున్నారు. మరి సినిమా అధికారికంగా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.