మహేష్ ఇక టెన్షన్ పడాల్సిన పనిలేదు!
ఇటీవలే మహేష్ ఎంచక్కా ప్యామిలీతో వెకేషన్ కి వెళ్లి మళ్లీ హైదరాబాద్ లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.;

ఎస్ ఎస్ ఎంబీ 29 ప్రారంభమైతే మహేష్ వెకేషన్ల పరిస్థితి ఏంటని? సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వైరల్ అయ్యాయి. షూటింగ్ ప్రారంభమైన తర్వాత దేశం విడిచి వెళ్లే అవకాశం ఉండదని....చిత్రీకరణ పూర్తయ్యేవరకూ బాండ్ అయి పనిచేయాల్సిందేనని....మహేష్ నోట వెకేషన్ అనే మాట సినిమా రిలీజ్ తర్వాత తప్ప మద్యలో రాదనే ప్రచారం ఓ రేంజ్ లో సాగింది. కట్ చేస్తే అవన్నీ గాలి వార్తలేనని తేలిపోయింది.
ఇటీవలే మహేష్ ఎంచక్కా ప్యామిలీతో వెకేషన్ కి వెళ్లి మళ్లీ హైదరాబాద్ లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఒడిశా షెడ్యూల్ అనంతరం రాజమౌళి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు. దీంతో ఆ బ్రేక్ ను మహేష్ వెకేషన్ కు వినియోగించుకున్నాడు. భార్య పిల్లలతో విదేశాలకు వెళ్లిపోయి రిలాక్స్ అయ్యాడు. దీన్ని బట్టి ఎస్ ఎస్ ఎంబీకి రాజమౌళి ఇలా బ్రేక్ ఇచ్చిన ప్రతీసారి మహేష్ ప్టైట్ ఎక్కేస్తాడని తెలుస్తోంది.
అయితే ఇది అన్ని వేళలా కుదరదు. అలా ప్లైట్ ఎక్కాలంటే ముందు రాజమౌళి అనుమతి తప్పనసరి. ఒక షెడ్యూల్ పూర్తై మరో షెడ్యూల్ మొదలు పెట్టే ముందు అవసరం మేర రాజమౌళి వర్క్ షాప్ లు నిర్వహిస్తుంటారు. లేదా ఆ షెడ్యూల్ కి సంబంధించి ట్రైనింగ్ ఆదేశాలు కూడా జారీ చేస్తుంటారు. అలాం టప్పుడు తప్పక రాజమౌళి తో పాటే ఉండాల్సి ఉంటుంది. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` విషయంలో హీరోలు ఇలాగే పనిచేసారు. చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ టప్ గానే పనిచేయాల్సి వచ్చింది.
కానీ ఇంతకన్నా కఠినంగా మహేష్ పనిచేయాల్సి ఉంది. ఎస్ ఎస్ ఎంబీ 29 అడ్వెంచర్ థ్రిల్లర్ అనేది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రం. షూటింగ్ ప్రారంభానికి ముందే కొన్ని రకాల శిక్షణలు మహేష్ పూర్తి చేసాడు. ఏడాదిన్నర పాటు సినిమా సెట్స్ లో ఉనే ఉంటుంది. ఈనేపథ్యంలో మధ్య మధ్యలో స్పెషల్ ట్రైనింగ్ లు అంటే అక్కడే ఉండాలి. ఒకవేళ లేకపోతే గనుక ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లిపోవచ్చు. అందులో ఎలాంటి అడ్డంకులు ఉండవు.