ఎప్పటికీ నీతోనే నమ్రత: పెళ్లి రోజు మహేష్ పోస్ట్ వైరల్
ఆ తర్వాత ఇద్దరూ కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా ఉంటున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమత్ర శిరోద్కర్ పెళ్లి రోజు ఈరోజు. ఫిబ్రవరి 10, 2005లో ముంబైలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అంటే ఇవాల్టికి వారి పెళ్లై 20 ఏళ్లు. 2000వ సంవత్సరంలో వంశీ సినిమా టైమ్ లో మహేష్ బాబు, నమ్రత మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత స్నేహంగా మారి తర్వాత కొన్నాళ్లకు ప్రేమగా మారింది.
ఆ తర్వాత ఇద్దరూ కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా ఉంటున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన నమ్రత కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉంటుంది. మహేష్, నమ్రతకు ఇద్దరు పిల్లలు. కొడుకు గౌతమ్ విదేశాల్లో చదువుకుంటుండగా, కూతురు సితార సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.
పెళ్లై 20 ఏళ్లవుతున్నా మహేష్, నమ్రత జంట ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. వారిద్దరి జంట ఎంతో చూడముచ్చటగా ఉంటుందనిపిస్తుంది. వైవాహిక జీవితం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ బాబు ఇన్‌స్టా ద్వారా ఓ క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ నమ్రతకు విషెస్ తెలిపాడు. ఆ పోస్ట్ లో నువ్వు, నేను, అందమైన 20 ఏళ్లు. ఎప్పటికీ నీతోనే నమత్ర అంటూ ఓ లవ్ ఎమోజీని మహేష్ షేర్ చేశాడు.
ఆ ఫోటోలో మహేష్ కళ్లన్నీ భార్య నమ్రత వైపే ఉండగా, నమ్రత ఎంతో సంతోషంగా కనిపిస్తుంది. ఈ పోస్ట్ చూసిన మహేష్ ఫ్యాన్స్ ఈ ఆదర్శ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొంతమంది నెటిజన్లు మాత్రం టాలీవుడ్ మొత్తం నీ వైపు చూస్తుంటే నువ్వు మాత్రం నమ్రత వైపు మాత్రమే చూస్తున్నావంటూ కామెంట్ చేస్తూ వారిని పొగుడుతున్నారు.
ఇదిలా ఉంటే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉండగా, నమ్రత వ్యక్తిగత జీవితం, మహేష్ సినీ కెరీర్ ప్లానింగ్, బిజినెస్‌లు తో పాటూ పలు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేయడంలో బిజీగా జీవితాన్ని గడుపుతుంది.