SSMB29: రెండుగా చీల్చేస్తున్న జక్కన్న?

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ SSMB29 ఎనౌన్స్ చేసి ఏళ్ళు దాటిపోయింది.

Update: 2024-12-09 12:39 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ SSMB29 ఎనౌన్స్ చేసి ఏళ్ళు దాటిపోయింది. పర్ఫెక్ట్ ప్లాన్ సెట్టయ్యే వరకు ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకు రాకూడదు అని జక్కన్న బలంగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎక్కువ టైమ్ తీసుకున్నా కూడా ప్రాజెక్ట్ చాలా గ్రాండ్ గా ఉండాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఆఫ్రికా అడవుల్లో ఇప్పటికే లొకేషన్స్ కోసం వేట మొదలెట్టిన రాజమౌళి గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ సంస్థలతో చర్చలు కూడా జరిపారు.

ఇక సినిమా ఎప్పుడు ఎలా మొదలవుతుంది అనే విషయంలో మరో ఆసక్తికరమైన అంశం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రూపొందబోతున్నట్లు సమాచారం. రాజమౌళి సినిమాలంటేనే భారీ అంచనాలు, గొప్ప కథనాలు, మరియు విజువల్ గ్రాండియర్ ఉంటాయని తెలిసిన విషయమే. ఇక రాజమౌళి బాహుబలి సిరీస్‌తో రెండు భాగాల కథనానికి నాంది పలికాడు.

"బాహుబలి: ద బిగినింగ్" - "బాహుబలి: ద కంక్లూజన్" సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా రెండు భాగాల సినిమాలకు కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చాయి. ఆ తర్వాత పుష్ప, సలార్, కల్కి, దేవర వంటి పాన్ ఇండియా సినిమాలు ఈ ఫార్మాట్‌ను ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు SSMB29 కూడా రెండు భాగాలుగా తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు సమాచారం.

SSMB29 ప్రాజెక్ట్ కోసం 1000 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించడం మరో విశేషం. ఇది టాలీవుడ్‌లోనే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డుగా నిలుస్తుంది. దుర్గా ఆర్ట్స్ పై KL నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేవలం భారీ బడ్జెట్‌తోనే కాదు, ఈ సినిమాను రెండు భాగాలుగా చేయడంతో స్టోరీలో డెప్త్, గ్రాండ్ విజువల్స్‌ను ప్రెజెంట్ చేయడంలో మరింత స్వేచ్ఛ లభిస్తుంది.

ఇక SSMB29 కథ కూడా అంతర్జాతీయ స్థాయి ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందిస్తుండటం విశేషం. మొదటి భాగం ఆసక్తికరంగా ముగిసి, రెండో భాగం కోసం ఆడియెన్స్ వేచిచూడడం అనేది ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాల్లో ట్రెండ్‌గా మారింది. బాహుబలి తర్వాత ఆ ఫార్మాట్ ఎంత సక్సెస్ అయ్యిందో పుష్ప-2, సలార్-2, దేవర-2 వంటి సినిమాలు చెబుతున్నాయి.

SSMB29కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే ఫినిష్ అయ్యింది, జనవరిలో SSMB29 షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. మహేష్ బాబు కెరీర్‌లోనే ఇది పెద్ద ప్రాజెక్ట్ కావడం విశేషం. ఆఫ్రికా అడవులను నేపథ్యంగా తీసుకొని ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులు మాత్రమే కాదు, పరిశ్రమలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News