మహేష్ రాజమౌళీ టార్గెట్ అతనే!
దీంతో 'దంగల్' రికార్డును చెరిపేసే బాధ్యత ఇప్పుడు సూపర్ స్టార్ మహేష పై పడింది. మళ్లీ ఛాన్స్ రాజమౌళినే తీసుకోవాల్సి వచ్చింది.
'బాహుబలి-2' తోనో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డు 'దంగల్ 2000' కోట్ల చరిత్రను చెరిపేస్తుందని అంతా భావించారు. కానీ 'ది కన్ క్లూజన్' 1800 కోట్ల వసూళ్ల వరకూ వచ్చి ఆగిపోయింది. దీంతో ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద రెండవ భారీ చిత్రంగా 'బాహుబలి-2' ఆస్థానాన్ని సంపాదించింది. ఇది చూసిన అమీర్ ఖాన్ రాజమౌళితో ఎలాగైనా తన రికార్డును తానే తిరగరాయాలని...దర్శకధీరుడ్ని రంగంలోకి దించాలని చూసారు. కానీ జక్కన్న తెలుగు హీరోలకు ఇచ్చిన ప్రాధాన్యత హిందీ నటులకు ఇవ్వకపోవడంతో అది సాధ్యపడలేదు.
దీంతో 'దంగల్' రికార్డును చెరిపేసే బాధ్యత ఇప్పుడు సూపర్ స్టార్ మహేష పై పడింది. మళ్లీ ఛాన్స్ రాజమౌళినే తీసుకోవాల్సి వచ్చింది. ఈ కాంబినేషన్ లో సినిమా ప్రకటించగానే ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఆప్రికన్ ఆడవుల నేపథ్యంలో తెరక్కిస్తున్న సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని అంతా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఎస్ ఎస్ ఎంబీర్ 29 టార్గెట్ దాదాపు ఫిక్స్ అయినట్లే.
'బాహుబలి-2' 1800 కోట్లు తెచ్చిందంటే? రాజమౌళి నెక్సట్ టార్గెట్ అంతకు మించి అంటే? 3000 కోట్ల టార్గెట్ తోనే బరిలోకి దిగుతున్నారని అంచనా వేయోచ్చు. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో కాంపిటీషన్ కూడా గట్టిగానే ఉంది. ప్రశాంత్ నీల్...సందీప్ రెడ్డి వంగా... రిషబ్ శెట్టి..సుకుమార్...చందు మొండేటి లాంటి వారు పాన్ ఇండియాని షేక్ చేసే కంటెంట్ తో సినిమాలు చేస్తున్నారు. కాబట్టి జక్కన్న అండ్ కో టార్గెట్ 3000 కోట్లు అయితే తప్ప! సేఫ్ జోన్ లో ఉన్నట్లు కాదు.
'పుష్ప -2' నే 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుంది అన్న కాన్పిడెన్స్ టీమ్ లో కనిపిస్తుంది. అలాగే 'సలార్- 2' కూడా 1500 కోట్లకు పైగానే గురి పెట్టింది. సందీప్ రెడ్డి తొలి పాన్ ఇండియాతోనే 1000 కోట్లకు దగ్గరకు వచ్చేసాడు. స్పిరిట్ తో అతడి టార్గెట్ 2000 కోట్లపైనే ఉంది.
మరోవైపు బాలీవుడ్ నుంచి గట్టి పోటీ కనిపిస్తుంది. ఇలాంటి తరుణలో మహేష్-రాజమౌళి టార్గెట్ మూడు వేల కోట్ల ఫిగర్ లేకపోతే ఎలా? ఈ సినిమాతో ఎలా లేదన్నా 'దంగల్' రికార్డు చెరిగిపోతుందని ట్రేడ్ బలంగా అంచనా వేస్తుంది. మరి అంతిమంగా ఎలా ఉంటుంది? అన్నది చూడాలి.