ఎట్టకేలకు ల్యాండ్‌ అయిన సూపర్‌ స్టార్‌

గతంలో ఎప్పుడూ లేనంత గడ్డంతో మహేష్ బాబు తాజా ఫోటోల్లో కనిపిస్తున్నాడు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Update: 2024-09-13 08:22 GMT

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు గత కొన్ని వారాలుగా అమెరికాలో ఉంటున్నాడు. కుటుంబ సభ్యులతో హాలీడేస్ ను ఎంజాయ్ చేయడంతో పాటు, తనయుడు గౌతమ్ కృష్ణ కు ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ లో అడ్మిషన్ కోసం కూడా మహేష్ బాబు ఇన్ని రోజులుగా అమెరికాలో ఉంటున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు యూఎస్ నుంచి మహేష్ బాబు రావడంతో మీడియా దృష్టిని ఆకర్షించారు. ఎయిర్‌ పోర్ట్‌ లో సితారతో కలిసి మహేష్ బాబు కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. గతంలో ఎప్పుడూ లేనంత గడ్డంతో మహేష్ బాబు తాజా ఫోటోల్లో కనిపిస్తున్నాడు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఆ మధ్య ఒక సినిమా కోసం మహేష్ బాబు కాస్త గడ్డం పెంచితేనే అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు కొన్ని నెలలుగా గడ్డం పెంచుతున్నాడు. బాబోయ్‌ మహేష్ బాబు మరీ ఇంత పెద్ద గడ్డంలో చూడాలా అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం మహేష్ బాబును ఇన్నాళ్లకు మ్యాన్లీ లుక్ లో చూపించబోతున్న రాజమౌళికి కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఎయిర్‌ పోర్ట్‌ లో కనిపించిన మహేష్ బాబు గుబురు గడ్డంతో పాటు, పొడవైన జుట్టు తో కనిపించాడు. కొత్త లుక్ కి ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

సోషల్‌ మీడియాలో మహేష్ బాబు ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. సితార కూడా పెద్ద పాప అయింది అంటూ ఈ ఫోటోలను చూసి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఫిల్మ్‌ స్కూల్‌ లో మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ కృష్ణ ను జాయిన్‌ చేసిన నేపథ్యంలో ముందు ముందు సితార ను కూడా యాక్టింగ్ స్కూల్ కి పంపిస్తే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సితార కెమెరా ముందుకు వచ్చింది. కనుక ముందు ముందు సినిమాల్లో హీరోయిన్‌ గా సితార నటించాలనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మరి మహేష్‌ అభిప్రాయం ఏంటనేది తెలియాల్సి ఉంది.

మహేష్ బాబు ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి సందర్భంగా 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌ గా నటించగా, మీనాక్షి చౌదరి కీలక పాత్రలో నటించింది. ఆ సినిమా పై ఉన్న అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోతున్న సినిమా పై ఉంది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల తర్వాత హాలీవుడ్‌ స్థాయిలో తన సినిమాలకు గుర్తింపు తెచ్చి పెట్టిన రాజమౌళి ఇప్పుడు హాలీవుడ్‌ స్థాయి సినిమాను మహేష్ బాబుతో తీయబోతున్నాడట. మరి ఆ సినిమా ఎలా ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News