మహేష్.. మళ్ళీ ఇలా చూడలేమెమో..
ఇది కూడా మురారికి ఆదరణ పెరగడానికి కారణం అవ్వొచ్చు. ఫ్యూచర్ లో మహేష్ బాబు నుంచి ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు వచ్చే ఛాన్స్ ఉండదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ ఆరంభంలో చేసిన ఫ్యామిలీ డ్రామా మురారి. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ సెకండ్ సక్సెస్. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ అయ్యింది. ఇప్పటికి మహేష్ ఎవర్ గ్రీన్ చిత్రాలలో మురారి కచ్చితంగా ఉంటుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మురారి చిత్రాన్ని 4Kలో రీరిలీజ్ చేశారు. గత నెల రోజులుగా ఈ సినిమా రీరిలీజ్ గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
దీంతో రీరిలీజ్ కి సూపర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. రికార్డ్ స్థాయిలో ఈ సినిమా కలెక్షన్స్ ని సాధించింది. మహేష్ బాబు నుంచి ఇప్పటి వరకు రీరిలీజ్ గా వచ్చిన అన్ని చిత్రాలలో బిజినెస్ మెన్ తర్వాత సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా మురారి నిలవడం విశేషం. ఇప్పటి వరకు ఈ మూవీ ఓవరాల్ గా 5.41 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంట. ఇండియాతో పాటుగా యూఎస్, ఆస్ట్రేలియాలో కూడా మురారి చిత్రాన్ని రీరిలీజ్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. రెండు దశాబ్దాల క్రితం మహేష్ బాబు నుంచి వచ్చిన చిత్రం కావడంతో మరోసారి స్క్రీన్ పై చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు. అందుకే సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో పాన్ వరల్డ్ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది.
ఈ ఏడాది ఆఖరులో లేదంటే 2025 ఆరంభంలో మహేష్ బాబు మూవీని జక్కన్న సెట్స్ పైకి తీసుకొని వెళ్లే ఛాన్స్ ఉంది. మరో రెండేళ్ల వరకు సూపర్ స్టార్ ని స్క్రీన్ పై చూసే ఛాన్స్ ప్రేక్షకులకి లభించదు. ఇది కూడా మురారికి ఆదరణ పెరగడానికి కారణం అవ్వొచ్చు. ఫ్యూచర్ లో మహేష్ బాబు నుంచి ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు వచ్చే ఛాన్స్ ఉండదు. రాజమౌళి సినిమా తర్వాత ఆయన మార్కెట్ పెరిగిపోతుంది.
యూనివర్సల్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని మేకర్స్ మహేష్ బాబు కోసం కథలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. అప్పుడు తెలుగు నేటివిటీలో ఉండే కుటుంబ కథలని చెప్పడం కష్టం అవుతుంది. స్టార్ హీరోలు ఫ్యామిలీ స్టోరీస్ చేస్తే మంచి రెస్పాన్స్ ఉంటుందని.. మురారి, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి సినిమాలు ప్రూవ్ చేశాయి. మహేష్ బాబు సైతం తన ఫ్యామిలీతో కలిసి మురారి 4K చూడటానికి థియేటర్ కి వెళ్ళారంట. మరోసారి ఆ సినిమా జ్ఞాపకాలని మహేష్ బాబు గుర్తుచేసుకోవడానికి ఈ సినిమాకి చూసినట్లు అర్ధమవుతోంది.