ఆ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది : మహేష్‌

కృష్ణ ను కొత్త యాంగిల్‌ లో చూపించిన అల్లూరి సీతారామరాజు సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మహేష్ బాబు ట్విట్టర్ లో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Update: 2024-05-02 06:16 GMT

సూపర్ స్టార్‌ కృష్ణ నటించిన సినిమాల్లో బెస్ట్‌ సినిమా ఏది అంటే ఎక్కువ మంది చెప్పే పేర్లలో 'అల్లూరి సీతారామరాజు' ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. తెలుగు సినిమా చరిత్రలో కూడా ఈ సినిమా చిరస్థాయిగా నిలిచి పోయేంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది.

 

1974 లో రామచంద్ర రావు దర్శకత్వంలో కృష్ణ హీరోగా రూపొందిన అల్లూరి సీతారామరాజు అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుని వసూళ్ల వరద పారించింది. దాదాపు ఏడాది కాలం పాటు సినిమా వసూళ్లు నమోదు అయ్యాయట. కృష్ణ ను కొత్త యాంగిల్‌ లో చూపించిన అల్లూరి సీతారామరాజు సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మహేష్ బాబు ట్విట్టర్ లో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

 

ట్విట్టర్‌ లో మహేష్ బాబు... నాన్న గారిని అల్లూరి సీతారామరాజు పాత్రలో మొదటి సారి గంభీరమైన లుక్‌ లో చూసి ఆశ్చర్యపోయిన సంఘటన నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. ఈ సినిమాను ఇప్పుడు చూసినా కూడా మొదటి సారి చూసిన ఫీల్ కలుగుతుంది. ఈ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నటుడిగా నా ప్రయాణం మరియు తెలుగు సినిమా పై నా ప్రభావంను గుర్తు చేసుకోవాలి అనుకుంటున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు.

 

అల్లూరి సీతారామరాజు పాత్రలో కృష్ణ నటించగా, సీత పాత్రలో విజయనిర్మల నటించారు. గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, బాలయ్య, రావు గోపాలరావు, కాంతారావు, చంద్రమోహన్‌, జగ్గయ్య, రాజనాల, మజుల, జయంతి, రాజశ్రీ ఇలా ఎంతో మంది అలనాటి మేటి తారాగణం ఈ సినిమాలో నటించారు.

ఈ సినిమా కొంత భాగం షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత దర్శకుడు రామచంద్ర రావు అనారోగ్యంతో మృతి చెందారు. దాంతో పలు సన్నివేశాలకు కృష్ణ దర్శకత్వం వహించగా, మిగిలి ఉన్న యాక్షన్‌ సన్నివేశాలను కేఎస్‌ఆర్‌ దాస్‌ పూర్తి చేశారు.

Tags:    

Similar News