న‌లుగురికి న‌చ్చిన‌ది నాక‌స‌లే న‌చ్చ‌దురో!

పార్టీ కోడ్ డ్రెస్ లో చ‌ర‌ణ్‌..తార‌క్.. వెంకీలు క‌నిపించ‌గా మ‌హేష్ మాత్రం స్టైలింగ్ త‌న‌దైన మార్క్ వేసారు. ఖ‌రీదైన బ్రాండెడ్ దుస్తుల్లో వావ్ అనిపించే లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

Update: 2023-11-12 15:31 GMT

టాలీవుడ్ తారలంద‌ర్నీ దివాలీ మ‌రోసారి మేమేకం చేసిన సంగ‌తి తెలిసిందే. నేటి ఉదయ‌మే వెంక‌టేష్‌.. మ‌హేష్‌..చ‌ర‌ణ్‌..తార‌క్ అంతా ఒకే ప్రేమ్ లో క‌నిపించి అభిమానుల్ని క‌నువిందు చేసారు. తొలుత మేఘాకృష్ణా రెడ్డి ఈవెంట్ లో త‌ళుక్కున మెరిసారు. అటుపై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇచ్చిన ప్రీ దివాలీ పార్టీతో స‌ర్ ప్రైజ్ చేసారు. హీరోలంతా దంప‌తుల‌తో పాటు హాజ‌రై ప్రేమ్ కే వ‌న్నే తీసుకొచ్చారు.


పార్టీ కోడ్ డ్రెస్ లో చ‌ర‌ణ్‌..తార‌క్.. వెంకీలు క‌నిపించ‌గా మ‌హేష్ మాత్రం స్టైలింగ్ త‌న‌దైన మార్క్ వేసారు. ఖ‌రీదైన బ్రాండెడ్ దుస్తుల్లో వావ్ అనిపించే లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఫుల్ హ్యాండ్స్ హేర్మేస్ టీష‌ర్ట్..జీన్స్ ప్యాంట్ ధ‌రించి అబ్బుర‌ప‌రిచారు. మ‌హేష్ లైక్ చేసే కంప‌ర్ట్ బుల్ దుస్తులివి. ఆయ‌న వెకేష‌న్ కి వెళ్లినా ఈ త‌ర‌హాలో దుస్తుల్లోనే క‌నిపిస్తారు. తాజాగా మేఘాకృష్ణ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ఆపార్టీలోనూ మ‌రోసారి మ‌హేష్ స్టైలింగ్ ఆక‌ట్టుకుంటుంది. సేమ్ బ్రాండ్ ఆరెంజ్ క‌ల‌ర్ టీష‌ర్ట్ లో క‌నిపించారు. టీష‌ర్ట్ పై లోగో రంగు మారంది త‌ప్ప‌! డిజైన్ సేమ్ టూ సేమ్. విక్ట‌రీ వెంక‌టేష్ తో దిగిన ఫోటోలు...చ‌ర‌ణ్ దంపతులు..మ‌హేష్ దంప‌తులతో పాటు ప్రెండ్స్ తో దిగిన ఫోటోల్లో మ‌హేష్ సంథింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతున్నారు.

అందులో ఆయ‌న ధ‌రించిన టీష‌ర్ట్ మ‌రింత ప్ర‌త్యేకంగా హైలైట్ అవుతుంది. హైఎండ్ ఫ్యాష‌న్ లో స్టైల్ కా బాప్ అనిపిస్తున్నారు. క్యాజువ‌ల్స్ లోనే మ‌హేష్ బ్యూటీతో మ‌రోసారి గాళ్స్ హృద‌యాల్ని ఛిద్రం చేసేస్తున్నారు. మ‌హేష్ ధ‌రించిన ఈ దుస్తుల ధ‌ర ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ప్రెండ్స్ గ్యాంగ్ లో ఎంత మంది ఉన్నా! మ‌హేష్ అండ్ హిజ్ కాస్ట్యూమ్స్ మాత్రం ఎక్కువ‌గా హైలైట్ అవుతున్నాయి. మ‌హేష్ పార్టీ కోడ్ లో ఎప్ప‌డూ క‌నిపించ‌రు. `న‌లుగురికి న‌చ్చిన‌ది నాక‌స‌లే ఇక న‌చ్చ‌దురో..న‌రులెవ‌రు న‌డ‌వ‌నిది ఆ రూట్లో నే న‌డిచెద‌రో`? అన్న‌ట్లే!

Tags:    

Similar News