మ‌హేష్ కెరీర్‌కే రికార్డ్ బ్రేకింగ్ అవుతుంది

అందుకే ఇప్పుడు గుంటూరు కారంలో అత‌డిని పూర్తిగా మాస్ అవ‌తారంలో చూడాల‌ని అభిమానులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు.

Update: 2023-11-21 14:50 GMT

సూప‌ర్ స్టార్ మ‌హేష్ లుక్స్ ప‌రంగా క్లాస్ గా క‌నిపించినా కానీ, అత‌డిలోని ఊర మాస్‌ని వెలికి తీసేందుకు తొలి నుంచి ద‌ర్శ‌కులు త‌హ‌త‌హ‌లాడారు. కెరీర్ ఆరంభ‌మే రాజ‌కుమారుడు చిత్రంలో మ‌హేష్ ని క్లాస్ లుక్స్ తో క‌నిపించే మాస్ హీరోగా కె.రాఘ‌వేంద్ర‌రావు చూపించారు. పోకిరిలో అండ‌ర్ కాప్ పాత్ర‌లో న‌టించిన మ‌హేష్ ని గ్యాంగ్ స్ట‌ర్ కోణంలో ఫుల్ యాక్షన్ మోడ్ లో చూపించారు పూరి. ఆ పాత్ర క్లాస్ కంటే మాస్ ఎలివేష‌న్ ఉన్న‌ది. బిజినెస్ మేన్ లోను మ‌హేష్ నుంచి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ వీక్షించాం. మ‌హేష్ కెరీర్ ఆద్యంతం మాస్ ఫార్ములా పెద్ద రేంజులోనే వ‌ర్క‌వుటైంది.

శ్రీ‌మంతుడు చిత్రంలో ఎంతో క్లాస్ గా క‌నిపించిన మ‌హేష్ ఆ త‌ర్వాత న‌టించిన సినిమాల్లో కొంత క్లాస్ గానే క‌నిపించాడు. అందుకే ఇప్పుడు గుంటూరు కారంలో అత‌డిని పూర్తిగా మాస్ అవ‌తారంలో చూడాల‌ని అభిమానులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. దానికి త‌గ్గ‌ట్టే ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ప్ర‌తిదీ ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో వేసిన సెట్లో ద‌మ్ మ‌సాలా అనే మాస్ సాంగ్ ని చిత్రీక‌రిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆన్ లొకేషన్ వీడియో ఒకటి లీక్ కాగా మహేష్ బాబు మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టేస్తున్నాడు.

ద‌మ్ మ‌సాలా పేరుకు త‌గ్గ‌ట్టే మ‌హేష్ పూర్తి మాస్ అవ‌తార్ లో క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది. ఇందులో ద‌మ్ మ‌సాలాను మించిన మాస్ పాట‌లు ఉంటాయ‌ట‌. అంటే త్రివిక్ర‌మ్ పూర్తి క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాతో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

పూర్తి మాస్ మ‌సాలా పాత్ర‌:

గుంటూరు కారంలో క్యారెక్టరైజేషన్ పరంగా మహేష్ కెరీర్‌లో అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా నిలవబోతోంది. మ‌హేష్ ని హార్డ్ హిట్ట‌ర్ అవతార్‌లో ఆవిష్క‌రించే ఈ మాస్ యాక్షన్ చిత్రం కోసం మాంత్రికుడు లాంటి దర్శకుడు 12 సంవత్సరాల తర్వాత మ‌హేష్ తో మళ్లీ కలుస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం మహేష్ బాబు మునుపటి రికార్డులన్నింటినీ తిరగరాస్తుందని, కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని కూడా అంచ‌నా వేస్తున్నారు. అనిల్ రావిపూడి తీసిన సరిలేరు నీకెవ్వరు - పరశురామ్ తీసిన సర్కారు వారి పాట వంటి చిత్రాలు మహేష్ స్టామినా - ఇమేజ్ బాక్సాఫీస్ వద్ద ఎలా అద్భుతాలు సృష్టిస్తాయో చెప్పడానికి క్లాసిక్ ఉదాహరణలు. ఇప్పుడు ట్యాలెంటెడ్ త్రివిక్ర‌మ్ తో చేస్తున్న ఈ సినిమా అన్ని రికార్డులు తిరగ‌రాస్తుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు.

గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, సునీల్, బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి, పప్పు పాలిస్టర్ , రఘుబాబు, మహేష్ ఆచంట, ముఖేష్ రిషి, రవికుమార్ అనేజా, సంజయ్ కృష్ణ, ప్రదుమ్ శుక్లా త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస మరియు పిఎస్ వినోద్ హెడ్ సినిమాటోగ్రాఫర్‌లుగా వ్యవహరిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. థమన్ ఎస్ ట్యూన్స్ కంపోజ్ చేసారు. హారిక & హాసిని క్రియేషన్స్ ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తోంది. AS ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ హెడ్‌గా పని చేస్తున్నారు. E S రాహుల్ గుంటూరు కారం కోసం విజువల్ ఎఫెక్ట్స్ విభాగాన్ని చూస్తున్నారు.

Tags:    

Similar News