మహేష్‌, జక్కన్న... ఓ హాలీవుడ్ స్టార్‌!

సూపర్ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే

Update: 2023-08-24 07:45 GMT

సూపర్ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది చివరి వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వెంటనే రాజమౌళి దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ కాంబో మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి నుండి రాబోతున్న సినిమా అనగానే పాన్ వరల్డ్‌ ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబర్చుతున్నారు. మహేష్ బాబు కోసం ఇప్పటికే రాజమౌళి ఒక అద్భుతమైన ఆఫ్రికన్ అడ్వెంచర్‌ బ్యాక్ డ్రాప్‌ కథ ను విజయేంద్ర ప్రసాద్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

మహేష్ బాబు కూడా రెండు నెలల పాటు స్క్రిప్ట్‌ చర్చల్లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఒక ప్రముఖ హాలీవుడ్‌ నటుడితో సంప్రదింపులు జరుపుతున్నారట. ఆ హాలీవుడ్‌ నటుడితో సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హాలీవుడ్ స్టార్‌ తో మహేష్ బాబు స్క్రీన్‌ షేర్ చేసుకోబోతున్నాడు అంటూ రాజమౌళి సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. కచ్చితంగా రాజమౌళి, మహేష్ బాబు మూవీ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా, ఇండియన్ సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు.

Tags:    

Similar News