సూపర్ స్టార్ స్టామినాకి లెక్కలివే
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్స్ అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. యూనివర్శల్ కథలతో తమ మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నంలో ఉన్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్స్ అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. యూనివర్శల్ కథలతో తమ మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నంలో ఉన్నారు. రీమేక్ కథలు కూడా చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. అయితే కెరియర్ లో ఒక్క రీమేక్ లేకుండా అన్ని స్ట్రైట్ సినిమాలతో స్టార్ హీరోగా నిలబడ్డ నటుడు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు ఫస్ట్ వినిపిస్తోంది.
రాజకుమారుడు నుంచి గుంటూరు కారం వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన సినిమాలు ఇతర భాషలలో రీమేక్ అయ్యి అక్కడి స్టార్స్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చాయి. అయితే ఇతర భాషలలో తెరకెక్కిన సినిమాలు మాత్రం మహేష్ బాబు చేయలేదు. ఆ యూనిక్ లైన్ ని మహేష్ బాబు మొదటి నుంచి మెయింటేన్ చేస్తూ వస్తున్నాడు. గత కొన్నేళ్ల నుంచి మహేష్ కెరియర్ లో సక్సెస్ లు ఎక్కువ ఉన్నాయని చెప్పాలి.
వంద కోట్లు బడ్జెట్ పెట్టిన కూడా చాలా ఈజీగా కలెక్షన్స్ వచ్చేలా మహేష్ బాబు సినిమాలకి ఆదరణ ఉంది. గుంటూరు కారం సినిమా వరకు మహేష్ బాబు రీజనల్ కి మాత్రమే పరిమితం. ఇప్పుడు రాజమౌళి మూవీతో పాన్ వరల్డ్ లెవల్ కి వెళ్లబోతున్నాడు. అందుకే చివరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రీజనల్ లెవల్ లో పక్కా మాస్ కమర్షియల్ స్టోరీతో గుంటూరు కారం సినిమా చేశాడు.
యావరేజ్ టాక్ వచ్చిన కూడా ఈ మూవీ ఏకంగా 111.81 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడం విశేషం. దీనిని బట్టి మహేష్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఆయన కెరియర్ లో హైయెస్ట్ షేర్ సరిలేరు నీకెవ్వరూ మూవీకి వచ్చింది. ఈ సినిమా ఏకంగా 138.78 కోట్ల షేర్ ని ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసింది. అవుట్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గానే ఈ చిత్రం తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు చివరి ఐదు సినిమాల షేర్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయి.
గుంటూరు కారం – 111.81CR*****
సర్కారువారిపాట - 110.12Cr
సరిలేరు నీకెవ్వరూ - 138.78Cr
మహర్షి – 104.58Cr
భరత్ అనే నేను – 101Cr