బయటపడను అంటూనే ఓపెనైన మలైకా
అర్జున్ కపూర్ నుంచి విడిపోవడానికి కారణమేంటో ఇప్పటివరకూ మలైకా అరోరా వెల్లడించలేదు.
అర్జున్ కపూర్ నుంచి విడిపోవడానికి కారణమేంటో ఇప్పటివరకూ మలైకా అరోరా వెల్లడించలేదు. ఇంకా తమ రిలేషన్ షిప్ గురించి సీక్రెసీ మెయింటెయిన్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. అయితే అర్జున్ ఒక ఈవెంట్‌లో `నేను ఒంటరిగా ఉన్నాను` అని ప్రకటించడంతో వారి బంధం ముగిసిందని స్పష్ఠత వచ్చింది. అతడు ఆ వ్యాఖ్య చేసిన తర్వాత మలైకా కూడా ఓపెనైంది. తాను కూడా సింగిల్ గా ఉన్నానని వెల్లడించడంతో మరింత స్పష్ఠత వచ్చింది.
అర్జున్ ఇటీవల మలైకా గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా కానీ, మలైకా ఇప్పుడు అర్జున్ ప్రకటనపై తనదైన శైలిలో స్పందించింది. తన వ్యక్తిగత జీవితాన్ని బహిరంగంగా చర్చకు పెట్టడం ఇష్టం లేదని మలైకా అంది. ``నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని.. నా జీవితంలో కొన్ని అంశాలు ఉన్నాయి. వాటి గురించి నేను ఎక్కువగా ఎవరికీ చెప్పాలనుకోను. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేందుకు నేను ఎప్పుడూ బహిరంగ వేదికను ఎంచుకోను. కానీ అర్జున్ ఏది చెప్పినా అది పూర్తిగా అతడి ఇష్టం..!`` అని అన్నారు. ఏం మాట్లాడాలో అది అతడి హక్కు అని అన్నారు.
ఓ సినిమా ప్రచార వేదికపై మలైకాతో తన రిలేషన్ షిప్ స్టేటస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ తాను ఇప్పుడు ఒంటరిగా ఉన్నానని అర్జున్ వెల్లడించాడు. దీంతో నెలల తరబడి కొనసాగుతున్న అన్ని ఊహాగానాలకు చెక్ పడిపోయింది.
మలైకా - అర్జున్ 2019లో తమ సంబంధాన్ని అధికారికం చేసుకున్నారు. ఈ జంట పబ్లిక్ అప్పియరెన్సులు ప్రతిసారీ చర్చనీయాంశమయ్యాయి. ఇద్దరి మధ్యా వయస్సు వ్యత్యాసం కారణంగా నెటిజనులు రకరకాల కామెంట్లు చేసేవారు. అయితే ఇవేవీ వారిని విడదీయలేదు. ఇప్పుడు విడిపోవడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ప్రస్తుతం మలైకా, అర్జున్ ఒకరితో ఒకరు స్నేహంగా ఉన్నారు. మలైకా తండ్రి ఆత్మహత్య చేసుకున్న క్రమంలో తనకు అర్జున్ అండగా నిలిచాడు.