హీరోయిన్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ

బాలీవుడ్‌ నటి మలైక అరోరాను పాత కేసు వెంటాడుతోంది. 2012లో ఒక రెస్టారెంట్‌కి వెళ్లిన సమయంలో జరిగిన గొడవ కారణంగా కేసు నమోదు అయింది.;

Update: 2025-04-08 05:23 GMT
హీరోయిన్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ

బాలీవుడ్‌ నటి మలైక అరోరాను పాత కేసు వెంటాడుతోంది. 2012లో ఒక రెస్టారెంట్‌కి వెళ్లిన సమయంలో జరిగిన గొడవ కారణంగా కేసు నమోదు అయింది. ఆ కేసులో నటి మలైకా అరోరా ఉందట. కేసు విచారణ సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది. ఇన్నేళ్లు అయినా కూడా కేసు ఒక కొలిక్కి రాలేదు. అందుకు కారణం కేసులో ఉన్న వారు హాజరు కాకపోవడం అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ కేసులో మలైకా అరోరా సైతం కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పాల్సి ఉండగా ఆమె ఎప్పటికప్పుడు కోర్టు ఆదేశాలను దిక్కరిస్తూ వచ్చిందట. గతంలోనే ఒక వాయిదా సందర్భంగా మలైకా అరోరాను హాజరు కావాలని, లేదంటే అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఆ అరెస్ట్‌ వారెంట్‌కి సైతం మలైకా అరోరా పట్టించుకోలేదు. ఆమెను అరెస్ట్‌ చేసి కోర్టు ముందు నిలపాలని న్యాయమూర్తి సూచించినా ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేయడంలో విఫలం అయ్యారట. ఆమె విషయంలో మరోసారి కోర్ట్‌ సీరియస్ వ్యాఖ్యలు చేసిందట. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా గైర్హాజరు అయినందుకు గాను తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని పేర్కొన్నారట. అంతే కాకుండా వెంటనే ఆమెను అరెస్ట్‌ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయడంతో పాటు, ఆమె కోర్టును అగౌరవ పరిచినందుకు గాను కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.

2012లో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌తో కలిసి మలైకా అరోరా, కరీనా కపూర్ ఖాన్‌ తదితర స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ అదే రెస్టారెంట్‌కి వచ్చిన మరో కస్టమర్‌తో సైఫ్‌ అలీ ఖాన్‌ గొడవ పడ్డాడట. దాంతో ఆ కస్టమర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్ట్‌ కేసు మొదలైంది. ఈ కేసులో మలైకా అరోరా సాక్షిగా ఉందని, ఆమె సాక్ష్యం చెప్పేందుకు రాకపోవడం వల్లే కేసు జాప్యం జరుగుతుందని కొందరు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన సమయంలో మలైకా అరోరాను ప్రధాన సాక్ష్యంగా పోలీసులు పేర్కొన్నారని, అందుకే ఆమె తప్పనిసరిగా కోర్టుకు హాజరు అయ్యి అసలు ఏం జరిగింది అనేది చెప్పాల్సి ఉంటుందట.

ఇన్నాళ్లు కోర్టుకు హాజరు కాలేక పోయిన మలైకా అరోరా ఈసారి అయినా కోర్టు ఆదేశాలను పాటించి సాక్ష్యం చెప్పేందుకు హాజరు అవుతుందా లేదంటే ఈసారి అరెస్ట్‌ అవుతుందా అంటూ బాలీవుడ్‌ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఈమధ్య కాలంలో పెద్దగా సినిమాలు చేయకున్నా ఇలాంటి వివాదాలు, ఇతర పుకార్లు, వర్కౌట్‌ వీడియోలు, ఫోటో షూట్స్ కారణంగా రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌ ప్రేక్షకులకూ ఐటెం సాంగ్‌తో సుపరిచితురాలు అయిన మలైకా అరోరా పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ కావడం ప్రస్తుతం బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News