అతిగా ప్లాన్ చేస్తే అంతేగా.. మలైకా నిరాశ!
వీలున్న ప్రతిసారీ నిర్లిప్తంగా నిగూఢంగా ఏదో ఒక పోస్ట్ పెడుతూ సోషల్ మీడియాల్లో అలజడి సృష్టిస్తోంది.
మలైకా అరోరా- అర్జున్ కపూర్ జంట బ్రేకప్ గురించి తెలిసిందే. అర్జున్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాడు. ఆ తరవాత మలైకా జీవితంలోని నిర్వేదాన్ని ఏదో ఒక సందేశం ద్వారా బాహ్య ప్రపంచానికి ఆవిష్కరిస్తోంది. వీలున్న ప్రతిసారీ నిర్లిప్తంగా నిగూఢంగా ఏదో ఒక పోస్ట్ పెడుతూ సోషల్ మీడియాల్లో అలజడి సృష్టిస్తోంది.
అర్జున్ కపూర్ అతను ఒంటరిగా ఉన్నాడని ధృవీకరించినప్పటి నుండి, మలైకా అరోరా తన నిగూఢమైన ఇన్‌స్టా పోస్ట్‌లతో చర్చగా మారుతోంది. మలైకా నేరుగా ప్రస్తావించకపోయినా తన పోస్ట్‌లు పుష్కలంగా సంచలనం సృష్టించాయి. జీవితాన్ని ఎలా నడిపించాలో చెబుతూ..అద్భుతమైన కోట్‌తో కూడిన తాజా ఇన్‌స్టా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మలైకా తాజాగా ఒక కోట్‌ను షేర్ చేసింది, ``అతిగా ప్లాన్ చేయవద్దు. మీరు ఏం ప్లాన్ చేసుకున్నా కానీ.. జీవితం దాని స్వంత ప్రణాళికలను కలిగి ఉంటుంది. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీ జీవితంలోని కొన్ని అందమైన క్షణాలు వాస్తవానికి ప్రణాళిక లేనివి`` అని చాలా అందమైన విషయాన్ని అంతే హృద్యంగా చెప్పుకొచ్చింది.
మలైకా వ్యక్తిగత కల్లోలాలను ఎదుర్కొంటూ కొన్ని నెలల పాటు సవాళ్లను ఎదుర్కొంది. దాదాపు ఆరేళ్ల తర్వాత అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత ఇటీవల తన తండ్రిని కోల్పోయింది. ఈ కష్టాలు ఎన్ని ఉన్నా మలైకా సానుకూలతతో ముందుకు వెళ్లాలని నిశ్చయించుకుంది. మలైకా అరోరా - అర్జున్ కపూర్ 2018లో డేటింగ్ ప్రారంభించారు, అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్న అనంతరం అర్జున్ తో మలైకా ప్రేమాయణం నిరంతరం హెడ్ లైన్స్ లోకొచ్చింది.