'నేను సింగిల్' అన్న యువ‌హీరోకి మ‌లైకా ఇచ్చిన ట్విస్ట్

ఇలాంటి స‌మ‌యంలో అర్జున్ క‌పూర్ సింగం ఎగైన్ ప్రచార కార్యక్రమంలో తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ప్రస్తావించాడు.

Update: 2024-10-31 20:30 GMT

మలైకా అరోరా - అర్జున్ కపూర్ జోడీ ఆరేళ్ల ప్రేమాయ‌ణానికి బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో ఈ బ్రేక‌ప్ క‌న్ఫామ్ అయింది. కానీ ఆ ఇద్ద‌రిలో ఎవ‌రూ దీనికి కార‌ణాన్ని కానీ, రిలేష‌న్ షిప్ స్టాట‌స్ గురించి కానీ ప్ర‌స్థావించ‌లేదు. దీంతో అభిమానులు ఇప్ప‌టికీ గంద‌ర‌గోళంలో ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో అర్జున్ క‌పూర్ సింగం ఎగైన్ ప్రచార కార్యక్రమంలో తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ప్రస్తావించాడు.

తాను ఇప్పుడు ఒంటరిగా ఉన్నానని వెల్లడించాడు. ఈవెంట్ నుండి వైరల్ అయిన వీడియోలో అతడి వ్యాఖ్య ఇలా ఉంది. ''అభి సింగిల్ హూన్ మెయిన్.. రిలాక్స్'' అని చెప్పాడు. అర్జున్ ప్రకటనపై అభిమానులు ప్రతిస్పందించడంతో క్లిప్ ఆన్‌లైన్‌లో వేగంగా వైర‌ల్ అయింది. అర్జున్ కపూర్ తాను సింగిల్ అని ప్రకటించిన ఒక రోజు తర్వాత బ్రేక‌ప్ గురించి నెలల తరబడి సాగుతున్న ఊహాగానాలను ధృవీకరిస్తూ మ‌లైకా అరోరా తన ఇన్‌స్టాలో ఒక రహస్య పోస్ట్‌ను షేర్ చేసారు. ''ఒక సెకను హృదయాన్ని తాకడం వల్ల జీవితకాలం పాటు ఆత్మను తాకవచ్చు'' అని రాసింది. దీనికి గుడ్ మార్నింగ్ ను కూడా జోడించింది. ఈ వ్యాఖ్య‌ను బ‌ట్టి వారి మ‌ధ్య మంచి స్నేహం ఉంద‌ని అర్థం చేసుకోవచ్చు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అర్జున్ కపూర్ విల‌న్ గా న‌టించిన 'సింగం ఎగైన్' దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సింగం ఎగైన్ ట్రైలర్ లాంచ్‌లో మీడియాను ఉద్దేశించి అర్జున్ మాట్లాడుతూ, రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌కు చెందిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో తాను భాగం కావ‌డాన్ని దాదాపుగా న‌మ్మ‌లేక‌పోయాన‌ని చెప్పాడు. రోహిత్ సార్ నన్ను ఈ చిత్రంలో భాగం చేయడానికి ఎంపిక చేయ‌డాన్ని గౌర‌వంగా భావిస్తున్నాను. నేను గోల్‌మాల్ - సింగం చూడటానికి సినిమా హాళ్లకు వెళ్లాను. నిజానికి నేను కూడా అతనితో కలిసి పనిచేయాలని కోరుకున్నాను. నాకు కూడా అజయ్‌ సర్‌తో పని చేయాలని ఉంది. నా కలలు నెరవేరుతాయనేది నాకు తెలియదు! దీనికి నేను చాలా సంతోషంగా ఉన్నాను.. అని అన్నాడు.

Tags:    

Similar News