క‌త్తెర‌తో అభిమాని నా ఇంట్లోకి జొర‌బ‌డింది: మ‌లైకా

అదంతా స‌రేకానీ.. ముంబైలోని తన ఇంట్లోకి కత్తెరతో అభిమాని చొరబడటం భ‌య‌పెట్టింద‌ని మలైకా అరోరా వెల్లడించింది.;

Update: 2025-03-31 20:30 GMT
Malaika words about her life

అగంత‌కులు ఇంట్లోకి ప్ర‌వేశించి ర‌గ‌డ సృష్టిస్తే అది ఎలా ఉంటుందో శ్రుతిహాస‌న్, సైఫ్ ఖాన్ లాంటి సెల‌బ్రిటీల‌కు అనుభ‌వం. ఒక్కోసారి అభిమానుల అంతు లేని అభిమానం కార‌ణంగా టెర్ర‌ర్ ఎలా ఉంటుందో అనుభ‌వించిన‌ సెల‌బ్రిటీలు ఉన్నారు. అదంతా స‌రేకానీ.. ముంబైలోని తన ఇంట్లోకి కత్తెరతో అభిమాని చొరబడటం భ‌య‌పెట్టింద‌ని మలైకా అరోరా వెల్లడించింది. ఆమె బ్యాగులో క‌త్తెర‌ను చూసి కొంచెం భయపడ్డానని అంది.

బాలీవుడ్ బబుల్‌తో సంభాషణ స‌మ‌యంలో .. తాను ఇంట్లో ఉన్నప్పుడు తన గదిలో ప్ర‌వేశించి ప్రశాంతంగా కూర్చున్న ఒక చొరబాటుదారు `ఫ్యాన్ మూవ్ మెంట్` గురించి మలైకా గుర్తు చేసుకుంది. ఆమె ఎలా వ‌చ్చిందో తెలీదు.. ఎలాంటి ఆధారాల్లేవ్. ఆమె అక్కడే కూర్చుంది! అని మలైకా చెప్పింది. ఆ క్ష‌ణం భ‌యం పుట్టింది. ఆమె నాతో మాట్లాడటానికి వచ్చింది.. కానీ నేను కొంచెం భయపడ్డాను.. ఇది చాలా నిజాయితీగా చెబుతున్నాను.. అని అంది. ఆ మ‌హిళా అభిమాని తన బ్యాగ్‌లో కత్తెర లేదా అలాంటి వ‌స్తువు ఏదో ఒకటి పెట్టుకుని వ‌చ్చింది. అది కొంచెం భయానకంగా ఉంది. ఏదో తప్పు జర‌గ‌బోతోందని భావించాను. కాబట్టి నేను ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాను. అత్యంత‌ క్రేజీ అభిమానులతో ఇదీ నా ప‌ర్య‌సానం``అని వెల్లడించింది.

కరీనా కపూర్ ఖాన్ - సైఫ్ అలీ ఖాన్ ల ఇంట్లో జరిగిన దోపిడీ ప్రయత్నం, క‌త్తిపోట్ల ఘ‌ట‌న‌ తర్వాత మ‌లైకా ఇలాంటి భ‌యాన‌క విష‌యాన్ని వెల్ల‌డించ‌డం అభిమానుల‌ను కంగారు పెట్టింది. సైఫ్ పై దాడి ఘ‌ట‌న త‌ర్వాత చాలా మంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత భద్రతను తిరిగి పెంచుకున్నారు. మలైకా కూడా ఇక‌పై భ‌ద్ర‌త‌ను పెంచుకుంటే మంచిదని అంచ‌నా వేస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. మలైకా ప్రస్తుతం `హిప్ హాప్ ఇండియా సీజన్ 2` జడ్జిగా కొన‌సాగుతోంది. తన దివంగత తండ్రి జ్ఞాపకార్థం ఒక ప్రాజెక్ట్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతున్నారు. మలైకా ఇప్ప‌టికే చిక్ బాంద్రా రెస్టారెంట్, స్కార్లెట్ హౌస్ వంటి వ్యాపారాల‌తో వ్యవస్థాపక ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇక్క‌డ సెల‌బ్రిటీలు, సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లూయెన్స‌ర్లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు.

Tags:    

Similar News