ఆరోజే మాళవికలో నటిని గుర్తించిన మిస్టర్‌పర్ఫెక్ట్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తెగా మాళవికకు అన్ని పరిశ్రమలలోను ప్రముఖులతో అనుబంధం ఉంది. అలా బాలీవుడ్ లోను మాళవిక ఫేమస్.
మాళవిక మోహనన్ పరిచయం అవసరం లేదు. 2024 కోలీవుడ్ బ్లాక్ బస్టర్ `తంగళన్`లో నటించింది. చియాన్ విక్రమ్ సినిమాలో కీలక పాత్రతో అదరగొట్టేసింది. మాళవికలో వెర్సటైలిటీకి వీరాభిమానులేర్పడ్డారు. అంతకుముందు మాస్టర్, పేట లాంటి భారీ చిత్రాల్లో మాళవిక నటనకు మంచి పేరొచ్చింది. కోలీవుడ్ లో నటించే సమయంలోనే టాలీవుడ్ లోను మాళవిక చేయని ప్రయత్నం లేదు. తెలుగులో పలువురు హీరోల సినిమాలకు కమిటైంది. దేవరకొండతో హీరో అనే చిత్రంతో ఈపాటికే తెలుగు చిత్రసీమకు పరిచయం కావాల్సి ఉన్నా, ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
కానీ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన టాలీవుడ్ కి పరిచయమవుతోంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ లో మాళవిక కథానాయికగా నటించింది. రాజా సాబ్ త్వరలోనే విడుదల కానుంది. ఇంతలోనే మాళవిక గురించి కొన్ని కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తెగా మాళవికకు అన్ని పరిశ్రమలలోను ప్రముఖులతో అనుబంధం ఉంది. అలా బాలీవుడ్ లోను మాళవిక ఫేమస్.
ముఖ్యంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ లాంటి స్టార్ తనను చిన్నప్పుడే గుర్తించారు. కాలేజీ అమ్మాయిగా ఉన్నప్పుడే తను మంచి నటిని కాగలనని అమీర్ ఖాన్ అన్నారట. `తలాష్` సెట్స్‌లో కలిసినప్పుడు మాళవికలో ప్రతిభను అమీర్ గుర్తించారు. ఈ విషయాన్ని మాళవిక ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అమీర్ మెచ్చుకోవడంతో నిజంగా మాళవిక నటిగా స్ఫూర్తిని పొందింది. మలయాళం, తమిళం, హిందీ పరిశ్రమలలో మాళవిక పెద్ద స్టార్ గా నిరూపించుకోవాలని తపిస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఇతర స్టార్ హీరోయిన్లకు ధీటుగా పోటీపడాలని భావిస్తోందట. ఇక్కడ పెద్ద హీరోల సరసన అవకాశాల కోసం సీరియస్ గా ప్రయత్నిస్తోంది. అయితే అన్నిటికీ `రాజా సాబ్` సమాధానం. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుని, తదుపరి పెద్ద ప్లానింగ్ తో ముందుకు సాగాలని ఆలోచిస్తోందట.