ప్రభాస్‌ని అర్థం చేసుకున్న ఒక మంచి లేడీ ఫ్రెండు
ప్రభాస్ సెట్లో ఎలా ఉంటాడో కూడా మాళవిక చెప్పింది. నిజానికి ప్రభాస్ చాలా సపోర్టివ్. చాలా కంఫర్టబుల్‌గా మారుస్తాడు.
మలయాళం, తమిళంలో కథానాయికగా నటించిన మాళవిక మోహనన్ తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో పట్టం పోల్ (2013)తో అరంగేట్రం చేసిన మాళవిక..ఆ తర్వాత మజీద్ మజీది దర్శకత్వం వహించిన బియాండ్ ది క్లౌడ్స్ (2017)లో తన నటనతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. రజనీకాంత్‌తో కలిసి పెట్టా (2019) , విజయ్‌తో కలిసి మాస్టర్ (2021) లాంటి హిట్ చిత్రాలలో నటించింది. యుధ్ర అనే హిందీ చిత్రంలో చివరిగా కనిపించింది.
తదుపరి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన 'రాజా సాబ్'తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతుంది. తాజా ఇంటర్వ్యూలో 'ది రాజా సాబ్' చిత్రీకరణ సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాళవిక మాట్లాడారు. కొత్త పరిశ్రమ, కొత్త భాషలో నటించడం సవాల్ అనిపించినా కానీ, కొత్త విషయాలు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని, దానికి తాను అలవాటు పడ్డానని మాళవిక తెలిపింది. కొత్త నగరంలో కొత్త సంస్కృతి అలవాటు చేసుకున్నానని కూడా వెల్లడించింది. నేను భయంతో ఉన్నా భాష పై ఆసక్తిగా ఉన్నాను. తెలుగు పదాలు పలికే విధానం, శబ్ధం నచ్చింది. నేను నటించని హారర్ కామెడీ శైలి నచ్చింది. ప్రతిదీ తెలుసుకునేందుకు నేను ఉత్సాహంగా ఉన్నాను. చాలా చిత్రాలలో ముఖ్యంగా హీరో ఎదిగే కొద్దీ, స్త్రీ పాత్ర తగ్గిపోతుంది. కానీ 'ది రాజా సాబ్' విషయంలో అలా జరగలేదు అని వెల్లడించింది.
ది రాజా సాబ్ లో పాత్రను ఓకే చేయడానికి కారణం.... సినిమా అంతా కథానాయిక పాత్ర ఉంటుంది. నటించేందుకు స్కోప్ ఉన్న పాత్ర కూడా. కొన్ని అద్భుతమైన సన్నివేశాల్లోను నటించాను. ఇంత భారీ చిత్రంలో నటీమణుల పాత్రల్ని చూపేందుకు స్కోప్ తక్కువ. కానీ నాకు ఆ పాత్ర చాలా నచ్చింది'' అని తెలిపింది. నేను ఎప్పుడూ డార్లింగ్ ప్రభాస్‌తో కలిసి పనిచేయాలని కోరుకున్నాను.. బాహుబలికి అతిపెద్ద అభిమానిని.. అని తన హీరోని పొగిడేసింది. దర్శకుడు మారుతి చాలా స్వీట్.. సెట్లో అన్నీ సవ్యంగా జరిగాయని అనుకుంటున్నాను అని మాళవిక తెలిపింది.
ప్రభాస్ సెట్లో ఎలా ఉంటాడో కూడా మాళవిక చెప్పింది. నిజానికి ప్రభాస్ చాలా సపోర్టివ్. చాలా కంఫర్టబుల్‌గా మారుస్తాడు. అతడు మనతో మాట్లాడతాడు. సెట్లోకి మంచి ఆహారం పంపుతాడు. అతడు అట్టహాసంగా స్వాగతిస్తాడు. బిర్యానీ తినిపిస్తాడు.. నాకు మాత్రమే కాదు. నా టీమ్ మొత్తానికి కూడా చాలా ఆహారం పంపేవాడు. అతడు నిజంగా చాలా స్వీట్. అతడి కామిక్ టైమింగ్ గొప్పది. హాస్యంతో చాలా నవ్విస్తాడు.. అని ప్రభాస్ గురించి మాళవిక చాలా చెప్పింది. ది రాజా సాబ్ 10 ఏప్రిల్ 2025న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ డిలే కారణంగా నిర్మాతలు త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తారని చెబుతున్నారు. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.