గ్లామర్ డోస్.. అందరూ ఒకేలా ఉండరు: మాళవిక మోహనన్

సౌత్ లో బ్యూటీఫుల్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ మాళవిక మోహనన్.

Update: 2024-10-12 08:30 GMT

సౌత్ లో బ్యూటీఫుల్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ మాళవిక మోహనన్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కూతురుగా ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి చిత్రాన్ని మలయాళంలో దుల్కర్ సల్మాన్ కి జోడీగా మాళవిక మోహనన్ చేసింది. 2013లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మరోవైపు 2017 లో ‘బియాండ్ ది క్లౌడ్’ అనే మూవీతో మాళవిక మోహనన్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పెట్ట’, విజయ్ ‘మాస్టర్’, ధనుష్ ‘మారన్’ సినిమాలలో మాళవిక మోహనన్ తమిళంలో వరుసగా నటించింది. ఈ సినిమాలతోనే అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. సినిమాలలో మామూలుగానే కనిపించిన కూడా మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్ లతో సందడి చేస్తూ ఉంటుంది. రెగ్యులర్ హాట్ ఫోటోషూట్ లతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే మాళవిక ‘ది రాజాసాబ్’ మూవీలో ప్రభాస్ కి జోడీగా నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న నేపథ్యంలో మూవీ పైన చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ ఏడాది చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మాళవిక మోహనన్ నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే మాళవిక మోహనన్ గ్లామర్ తో పాటు అప్పుడప్పుడు తన మాటలతో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార మీద మాళవిక వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు ఎంత సంచలనం అయ్యాయో అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్స్ గ్లామర్, ప్రేక్షకుల అభిరుచి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మలయాళంలో హీరోయిన్ గా పరిచయం అయినపుడు తన బాడీ, లుక్ పరంగా ట్రోలింగ్ ఎదుర్కొన్నట్లు తెలిపింది. సన్నగా ఉండటం వలన అప్పుడు తనని అందరూ ట్రోల్ చేసారని పేర్కొంది.

ఒక్కో ఇండస్ట్రీలో ఆడియన్స్ కి హీరోయిన్స్ గ్లామర్ విషయంలో ఒక్కో రకమైన టేస్ట్ ఉంటుందని అన్నారు. బాలీవుడ్ లో ఒక అథ్లెట్ తరహా ఫిజిక్ తో ఉంటే ఆడియన్స్ ఇష్టపడతారని చెప్పింది. అయితే తమిళ్, తెలుగు భాషలలో కాస్తా బొద్దుగా, చబ్బీగా ఉండే హీరోయిన్స్ ని ఎక్కువ లైక్ చేస్తారని తెలిపింది. మలయాళంలో కూడా సన్నగా ఉండే హీరోయిన్స్ ని చూడటానికి ఇష్టపడరని మాళవిక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags:    

Similar News