సలార్‌లో మిస్‌ అయినా రాజాసాబ్‌లో నిలిచింది

తమిళ్‌లో స్టార్‌ హీరోలకు, సూపర్‌ స్టార్‌ హీరోలకు జోడీగా నటించడం ద్వారా టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌

Update: 2024-12-30 09:30 GMT

తమిళ్‌లో స్టార్‌ హీరోలకు, సూపర్‌ స్టార్‌ హీరోలకు జోడీగా నటించడం ద్వారా టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌. ఈ అమ్మడు చాలా ఏళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. తెలుగు లో ఈ అమ్మడు ఒక్క సినిమా చేయకున్నా మంచి గుర్తింపును దక్కించుకుంది. డబ్బింగ్‌ సినిమాలతో దక్కిన గుర్తింపుతో టాలీవుడ్‌లో మంచి ఎంట్రీకి ఈ అమ్మడు ప్రయత్నాలు చేసింది. సలార్‌ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ అమ్మడు కొన్ని కారణాల వల్ల తప్పింది. కానీ అదృష్టం కొద్ది రాజాసాబ్‌ సినిమాతో ప్రభాస్‌తో కలిసి టాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌ మాట్లాడుతూ... నాకు బాహుబలి 1 మరియు బాహుబలి 2 సినిమాలు అంటే చాలా ఇష్టం. అప్పటి నుంచి ప్రభాస్‌ గారితో వర్క్ చేయాలని కోరుకున్నాను. ఆయన అంటే అమితమైన అభిమానం నాకు ఉంది. అందుకే ఆయనతో వర్క్‌ చేయడం కోసం ఎదురు చూశాను. అనుకోని అవకాశం అన్నట్లుగా ఒకసారి ప్రశాంత్‌ నీల్‌ సర్‌ సలార్‌ సినిమాలో నటించాలి అంటూ అడిగారు. తాను సైతం సినిమా కోసం రెడీ అన్నట్లుగా ఎదురు చూశాను, కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను చేయలేక పోయాను. కానీ కొన్నాళ్ల తర్వాత మారుతి సర్ కాల్‌ చేసి రాజాసాబ్‌ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.

ప్రభాస్‌ సర్‌తో నటించాలి అనే కోరిక రాజాసాబ్‌ తో తీరింది. ఆ సినిమాలో తన పాత్ర గురించి ఇప్పుడు చెప్పలేను. కానీ సినిమా చాలా బాగుంటుంది అని హామీ ఇచ్చింది. షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది అని, తన పోర్షన్‌ షూటింగ్‌ సైతం పూర్తి అయ్యిందని చెప్పుకొచ్చింది. త్వరలోనే సినిమా నుంచి మారుతి గారు అప్‌డేట్‌ ఇస్తారని ఆమె హామీ ఇచ్చారు. ప్రభాస్ కెరీర్‌లో ఇదో స్పెషల్‌ మూవీగా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు పదే పదే చెబుతున్నారు. కనుక ఈ సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరూ చాలా నమ్మకంగా చెబుతున్నారు.

రాజాసాబ్‌ సినిమాలో ప్రభాస్‌తో పాటు సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక హీరోయిన్‌గా మాళవిక మోహనన్‌తో పాటు నిధి అగర్వాల్‌ రిద్ది లు నటిస్తున్నారు. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. సలార్‌, కల్కి 2898 ఏడీ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాల తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. 2025లోనే రాజాసాబ్‌ తో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News