బోల్డ్ లుక్‌లో రాజాసాబ్ హీరోయిన్.. మైండ్ బ్లోయింగ్!

ఇక రాబోయే ద రాజా సాబ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతోంది.;

Update: 2025-03-28 16:58 GMT
బోల్డ్ లుక్‌లో రాజాసాబ్ హీరోయిన్.. మైండ్ బ్లోయింగ్!

తెలుగు ప్రేక్షకులకు "మాస్టర్" సినిమా ద్వారా పరిచయమైన మాళవికా మోహనన్, అప్పటి నుంచి సౌత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. తమిళంలో ధనుష్‌తో కలిసి మారన్, ఆ తరువాత విక్రమ్‌తో థంగలాన్ సినిమాతో తమిళంలో మరింత క్రేజ్ అందుకుంది. ఇక రాబోయే ద రాజా సాబ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతోంది.


బాలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్టులు చేస్తున్న మాళవికా, ఇప్పుడు తన స్టన్నింగ్ లుక్స్‌తో కూడా తెగ దూసుకుపోతుంది. తాజాగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో మలవికా కనిపించిన లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెరిసే బ్లాక్ అవుట్‌ఫిట్‌లో మాళవికా చూపించిన స్టైల్ ఎట్రాక్షన్ పీక్‌కి వెళ్లిపోయింది. ప్లంజింగ్ డీప్ వెనలైన్, థై హై స్లిట్ డిజైన్‌తో ఉన్న డ్రెస్ ఆమె గ్లామర్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. తన లుక్స్‌తో పాటు డ్రెస్సింగ్ స్టైల్ ఓ కొత్త డెఫినిషన్ ఇచ్చింది.


సిల్వర్ డ్రాప్ ఈయరింగ్స్, స్లిక్ స్ట్రెయిట్ హెయిర్‌తో క్లాసీ టచ్‌ను జోడించిన మలవికా, పౌడరీ మేకప్‌తో సూట్ తో పర్ఫెక్ట్ స్టిల్ చేసింది. రాంప్‌వాక్ చేస్తూ ఆమె చూపించిన హావభావాలు, ఫొటోకెమెరాల ముందు ఇచ్చిన పొజెస్ అన్నీ కలిపి ఆమెకి ఫ్యాషన్ ఐకాన్‌ ట్యాగ్ పెడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు “ఇట్స్ గివింగ్ ఫైర్ వైబ్స్,” “మలవికా అన్ స్టాపబుల్,” అంటూ కామెంట్లు చేస్తున్నారు.


రాజాసాబ్ చిత్రంలో మలవికా పోషిస్తున్న పాత్ర పవర్ఫుల్ గా ఉండనుందని టాక్. అదే సమయంలో గ్లామర్ షోలోనూ తన మార్క్ చూపిస్తూ టాలీవుడ్, బాలీవుడ్‌లో బిజీగా మారేందుకు సిద్ధమవుతోంది. ప్రెజెంట్ గ్లామర్ ఫోటో షూట్స్‌తో పాటు సినిమా సెలక్షన్స్‌ కూడా చూసుకుంటే మలవికా ఇప్పుడు ట్రెండింగ్ మాత్రమే కాదు.. ఫాలో చేయాల్సిన స్టార్‌గా మారుతోంది.

Tags:    

Similar News