ఆ విషయంలో మా అమ్మ తర్వాత ప్రభాస్ బెస్ట్..

ప్రభాస్.. ఈ పేరుకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2024-08-05 17:30 GMT

ప్రభాస్.. ఈ పేరుకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ అంటే అభిమానులకే కాదు తోటి నటీనటునులకు కూడా ఎంతో అభిమానం. ఎందుకంటే ప్రభాస్ ప్రతి ఒక్కరిని పలకరించే విధానం.. వాళ్లను ఆదరించే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక ప్రభాస్ తో సినిమా చేసిన ప్రతి ఒక్కరూ ప్రభాస్ ని ఒక విషయంలో తెగ పొగుడుతూ ఉంటారు. తాజాగా ప్రభాస్ రాజా సాబ్ మూవీలో నటిస్తున్న మాళవిక మోహనన్ అతని ఏకంగా ఆమె తల్లి తోటి పోల్చింది.


ప్రభాస్ తో కలిసి పనిచేసే ఎవ్వరైనా సరే ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడాలి అంటే ఆయన పెట్టే భోజనం గురించి ప్రస్తావిస్తారు. గతంలో ప్రభాస్ తో సలార్ చిత్రంలో నటించిన పృథ్వీరాజ్ కూడా ఇదే విషయాన్ని చాలా సార్లు ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకసారి పృథ్వీరాజ్ని కలవడానికి అతని భార్య ,కూతురు వచ్చారు. పాపకు ఏమి ఫుడ్ ఇష్టమో తెలుసుకున్న ప్రభాస్ పాప కోసం స్పెషల్ గా ఇంటిదగ్గర నుంచి వంటలు చేయించి పంపించారు. ఇక ప్రభాస్ పంపించిన భోజనం కోసం పృథ్వీరాజ్ సెపరేట్గా ఒక రూమే తీసుకోవాల్సి వచ్చిందట. ప్రభాస్ పెట్టే భోజనం లెవల్ ఎలా ఉంటుందో తెలియడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు.

తాజాగా ఈ లిస్టులో మరో హీరోయిన్ కూడా యాడ్ అయింది. ప్రభాస్ తో కలిసి రాజా సాబ్ మూవీలో నటిస్తున్న తమిళ్ బ్యూటీ మాళవిక మోహనన్ విక్రమ్ తంగలాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రభాస్ తో ఆమె నటిస్తున్న మూవీ గురించి మాట్లాడుతూ మాళవిక ప్రభాస్ ఫుడ్ గురించి కూడా మాట్లాడింది.

ప్రభాస్ తన కోసం హైదరాబాద్ లో బెస్ట్ ఫుడ్ పంపారు..మా అమ్మ ఫుడ్ తర్వాత నేను ఇప్పటివరకు తిన్న ఫుడ్ లో బెస్ట్ ఫుడ్ కూడా అదే. ప్రభాస్ సార్ వల్ల నేను ఇక్కడ షూటింగ్ లో ఉన్నా మా అమ్మ ఫుడ్ మిస్ అయింది అన్న ఫీలింగ్ నాకు రాలేదు.. అంటూ ఈ బ్యూటీ ప్రభాస్ ను తెగ పొగిడేసింది. ఇక రాజా సబ్ మూవీ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం తనకు ఎంతో హ్యాపీగా ఉంది అని పేర్కొంది. ఇక ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ ఎంతో అద్భుతంగా ఉంది అని వర్ణించిన మాళవిక రాజా సాబ్ మూవీలో ప్రభాస్ లో మరొక యాంగిల్ ని చూస్తారని పేర్కొంది. అంతేకాదు విక్రమ్ తంగలాన్ మూవీలో తాను చేస్తున్న పాత్రకి రాజాసాబ్ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది అని తెలిపింది.

Tags:    

Similar News