ఎదురు తిరిగిన ఫలితం.. మాలీవుడ్ నుంచి నటి నిషేధం?
ఇదిలా ఉంటే, సంస్థ నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో మలయాళ నటి-నిర్మాత సాండ్రా థామస్‌ను కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుండి తొలగించారు.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్రసీమను పట్టి కుదిపేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలతో పరిశ్రమ అట్టుడికింది. ఇరుగు పొరుగు పరిశ్రమలపైనా దీని ప్రభావం అంతో ఇంతో పడింది. ఇదిలా ఉంటే, సంస్థ నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో మలయాళ నటి-నిర్మాత సాండ్రా థామస్‌ను కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుండి తొలగించారు.
లిస్టిన్ స్టీఫెన్, ఆంటో జోసెఫ్, బి రాకేష్ సహా ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులపై సాండ్రా థామస్ తప్పుడు కేసు పెట్టారని పేర్కొంటూ నిర్మాతల సంఘం ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ పంపింది. అయితే దీనిని సాండ్రా ఖండించారు. మీడియాతో మాట్లాడిన సాండ్రా థామస్ సినీ పరిశ్రమలోని 'పవర్ గ్రూప్' వేసిన కొన్ని దుష్ట ప్రణాళికలో భాగంగానే తనను అసోసియేషన్ నుండి తొలగించారని అన్నారు.
''నన్ను బహిష్కరించే నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు అని ఎవరైనా నన్ను అడిగితే, నేను అసోసియేషన్ పెద్దలపై వేలెత్తి చూపించాల్సి ఉంటుంది. నిజం కచ్చితంగా బయటకు వస్తుంది'' అని సండ్ర అన్నారు. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను ఎదుర్కోవడానికి తాను బలంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సాండ్రా చెప్పారు. సినిమా పంపిణీకి సంబంధించిన సమావేశంలో తనకు అవమానం జరిగిందని సాండ్రా థామస్ ఫిర్యాదు చేసింది. అధికారులు సండ్రతో అనుచితంగా మాట్లాడారని, దీంతో ఆమె నిర్మాతల సంఘంపై ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) ఫిర్యాదు చేసింది.
సినీ పరిశ్రమలో జరుగుతున్న సమస్యలపై సండ్ర తన స్వరం వినిపించడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు ఆమె మాట్లాడుతూ సినిమా సెట్స్‌లో మహిళలు తరచుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని, ఇది మానసిక వేదనకు దారితీస్తుందని అన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలను మినహాయించి 'పవర్ గ్రూప్' ఉందని కూడా సాండ్రా చెప్పారు. షేన్ నిగమ్ నటించిన 'లిటిల్ హార్ట్స్' కి సాండ్ర నిర్మాత.