థ్రిల్లర్ ఆడియన్స్ కు రేఖాచిత్రం వచ్చేస్తుంది..!

త్వరలో రిలీజ్ కాబోతున్న ఒక క్రైం థ్రిల్లర్ సినిమా కోసం మలయాళ ఆడియన్స్ తో పాటు మిగతా సౌత్ ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు.

Update: 2025-02-15 16:01 GMT

మలయాళ సినిమాలకు నేషనల్ వైడ్ గా ఒక సెపరేట్ క్రేజ్ ఏర్పడింది. ఓటీటీలు వచ్చాక అది మరింత పెరిగింది. మలయాళం లో తెరకెక్కించే ప్రతి సినిమాకు మంచి బజ్ వస్తుంది. ముఖ్యంగా అక్కడ చేస్తున్న క్రైం థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఆల్రెడీ థియేట్రికల్ హిట్ కొట్టిన ఈ సినిమాలకు ఓటీటీలో రిలీజ్ అయ్యాక మిగతా భాషల ప్రేక్షకుల ఆమోదం పొందుతున్నారు. త్వరలో రిలీజ్ కాబోతున్న ఒక క్రైం థ్రిల్లర్ సినిమా కోసం మలయాళ ఆడియన్స్ తో పాటు మిగతా సౌత్ ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు.

మలయాళంలో సెన్సిబుల్ సినిమాలు ఎంత హృద్యంగా తీస్తారో దానికి పూర్తి వ్యతిరేకంగా ఉండే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తారు. అక్కడ నుంచి వచ్చే ప్రతి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయంటే నమ్మాల్సిందే. ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్ అయిన మలయాళ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఇంట్రెస్ట్ గా ఉన్నారు. రేఖాచిత్రం సినిమా కూడా త్వరలో ఓటీటీ రిలీజ్ అవుతుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం మార్చి 7న సోనీ లివ్ లో రేఖాచిత్రం అన్ని భాషల్లో డిజిటల్ రిలీజ్ అవుతుంది.

అసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమా జనవరి 9న థియేట్రికల్ రిలీజైంది. జోఫిన్ టి.చాకో డైరెక్ట్ చేసిన ఈ సినిమా 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా 55 కోట్ల వసూళ్లతో అదరగొట్టేసింది. సినిమా డిజిటల్ రైట్స్ రూపంలో కూడా భారీ మొత్తం రాబట్టిందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం కూడా ఆడియన్స్ ఎంతో ఎగ్జైట్ గా ఉన్నారు. ఫైనల్ గా మార్చి 7న రేఖాచిత్రం సినిమా ఓటీటీ రిలీజ్ అవుతుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వస్తుంది.

మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. రోజే రాజేంద్రన్ అనే వ్యక్తి సూసైడ్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ 40 ఏళ్ల కింద జరిగిన హత్యతో ఈ సూసైడ్ కు సంబంధం ఉందని తెలుస్తుంది. అంతేకాదు విచారణలో నివ్వెరపోయే విషయాలు తెలుస్తాయి. ఫైనల్ గా ఈ కేసుని ఎలా చేధించారు అన్నది రేఖాచిత్రం కథ. ఇలాంటి కథలు సినిమాలు తీయడంలో మలయాళ మేకర్స్ తర్వాతే అనేలా మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. మరి ఈ రేఖాచిత్రం డిజిటల్ రిలీజ్ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News