'నాయట్టు' కి వీళ్లు న్యాయం చేసేనా..?
ఈ సమయంలోనే నాయట్టు సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 వారు ‘కోటబొమ్మాళి పీఎస్’ అనే టైటిల్ తో నిర్మిస్తున్నారు.
మలయాళం నుండి ఈ మధ్య కాలంలో వరుసగా టాలీవుడ్ లో రీమేక్ లు వస్తున్నాయి. చిన్న హీరోలు మాత్రమే కాకుండా పలువురు స్టార్ హీరోలు కూడా మలయాళ సూపర్ హిట్ సినిమాలను రీమేక్ చేశారు.. ఇంకా కొందరు రీమేక్ కి సంబంధించిన చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలోనే నాయట్టు సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 వారు ‘కోటబొమ్మాళి పీఎస్’ అనే టైటిల్ తో నిర్మిస్తున్నారు.
గీతాఆర్ట్స్ సినిమా అంటే ఏమాత్రం అనుమానం లేకుండా సినిమాపై నమ్మకం పెట్టుకోవచ్చు. వారి బ్యానర్ నుండి ఇప్పటికే వచ్చిన సినిమాల్లో చాలా వరకు భారీ విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది. కనుక ఈ రీమేక్ కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఉలతో అయితే నాయట్టు రీమేక్ కోసం మేకర్స్ ఎంపిక చేసుకున్న నటీ నటుల విషయంలో కొన్ని విమర్శలు ఉన్నాయి. నాయట్టు సినిమా స్టార్ హీరో... ప్రముఖ నటీ నటులతో రీమేక్ చేయాల్సింది. కానీ స్టార్స్ లేకుండానే నాయట్టు సినిమా రీమేక్ చేస్తున్నారు. లీడ్ రోల్స్ లో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లు కనిపించబోతున్నారు.
ఈ రీమేక్ కోసం ఎంపిక చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఫామ్ కోల్పోయి కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి సమయంలో వారికి ఈ రీమేక్ బాధ్యతలు అప్పగిస్తే ఏం చేస్తారో ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కథ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. నటీ నటుల నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉండాలి.
అలాంటి ఈ రీమేక్ లో వీళ్లు నటించి ఎంత వరకు రీమేక్ కు న్యాయం చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. శ్రీకాంత్ సీనియర్ అయ్యాడు. వరలక్ష్మి శరత్ కుమార్ కాస్త పర్వాలేదు అన్నట్లు ఉంది. మిగిలిన వారు సత్తా చాటేనా చూడాలి.