కావాలని నన్ను తప్పుగా పోర్ట్రైట్ చేసి చూపిస్తున్నారు

ఇదిలా ఉంటే తిరగబడర సామి మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాల్వీ మల్హోత్రా తన చుట్టూ జరుగుతున్న రాజ్ తరుణ్, లావణ్య వివాదంపైన రియాక్ట్ అయ్యింది.

Update: 2024-08-02 04:28 GMT

రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మెయిన్ ఫోకస్ అంతా హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మీద ఉంది. రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకొని తనని దూరం పెట్టాడని ఆరోపణలు చేస్తోంది. అలాగే ఇద్దరు కలిసున్నారని కూడా అంటుంది. మాల్వీ మల్హోత్రా తనకి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరిస్తుందని కూడా లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్ గురించి లావణ్య మాట్లాడిన ప్రతిసారి మాల్వీ మల్హోత్రా పేరునే ప్రస్తావిస్తూ వస్తోంది. లావణ్య ఆరోపణల నేపథ్యంలో మాల్వీ మల్హోత్రా మీద కూడా కేసు ఫైల్ అయ్యింది.

తిరగబడర సామి సినిమాతో మాల్వీ మల్హోత్రా టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెడుతోంది. అయితే మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఇలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కోవడం అంటే కచ్చితంగా ఇబ్బందికరం అని చెప్పాలి. కెరియర్ పరంగా కూడా మాల్వీ మల్హోత్రాకి ఎంతోకొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తిరగబడర సామి మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాల్వీ మల్హోత్రా తన చుట్టూ జరుగుతున్న రాజ్ తరుణ్, లావణ్య వివాదంపైన రియాక్ట్ అయ్యింది.

అన్ని విషయాలని షేర్ చేసుకుంది. నా గురించి లావణ్య చేస్తోన్న ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదు. బయట జరుగుతున్న ప్రచారాలన్ని కూడా ఫ్యాబ్రికేటెడ్. కావాలని నన్ను తప్పుగా పోర్ట్రైట్ చేసి చూపిస్తున్నారు. ఇప్పటికే లావణ్యపై పోలీసులకి ఫిర్యాదు చేశాను. పోలీసులు దీనిపై సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నాను. రాజ్ తరుణ్ తో నాకు కోయాక్టర్ అనే ఫ్రెండ్ షిప్ తప్ప అంతకుమించి ఎలాంటి రిలేషన్ లేదు. అయితే మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు లావణ్య ఎందుకు ప్రచారం చేస్తుందో నాకు అర్ధం కాలేదు.

గతంలో ఇదే తరహాలో నాపై ఆరోపణలు వచ్చాయి. హత్యాయత్నం జరిగింది. అలాగే నా మీద ఎటాక్ చేసిన వ్యక్తి తల్లి బయటకొచ్చి నాపై ఆరోపణలు చేసింది. ఇవన్నీ చూసుకొని లావణ్య కూడా నన్ను టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. అందుకే రాజ్ తరుణ్ తో చేసిన మిగిలిన హీరోయిన్స్ మీద రాని ఆరోపణలు నా మీద వస్తున్నాయని నమ్ముతున్నాను. అయితే ఈ రెండు సంఘటనలలో నేను బాధితురాలిగానే ఉన్నానని మాల్వీ మల్హోత్రా చెప్పుకొచ్చింది. లావణ్య ఆరోపణలు నా ఫ్యామిలీని బాగా డిస్టర్బ్ చేశాయి. వాళ్ళు చాలా అప్సెట్ అయ్యారు.

నాతో సరిగా మాట్లాడటం లేదు. డబ్బు కంటే గౌరవానికి మా పేరెంట్స్ ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ వలన రెప్యుటేషన్ చాలా డ్యామేజ్ అయ్యిందని పేరెంట్స్ బాధపడుతున్నారు. నేను కూడా స్టార్టింగ్ లో ఆ ఆరోపణలు విని డిస్టర్బ్ అయ్యాను. తరువాత నాతో నేను మాట్లాడుకున్న. ఎంత ప్రయత్నం చేసిన పబ్లిక్ వాయిస్ ని కంట్రోల్ చేయలేము. ఎలా ఉన్న వారు చేయాల్సిన కామెంట్స్ చేస్తూనే ఉంటారు. వాటికి రియాక్ట్ అయితే మానసికంగా మనం వీక్ అవుతామని భావించి పట్టించుకోవడం మానేసాను అని మాల్వీ మల్హోత్రా ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది.

Tags:    

Similar News