మలయాళ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే..!

ఆ సినిమా రిలీజైన దగ్గర నుంచి సౌత్ ఆడియన్స్ కు మమితా బైజు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది.

Update: 2024-10-27 10:30 GMT

మలయాళంలో ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న యువ హీరోయిన్ మమితా బైజు. 2017 లో సర్వోపారి పాలక్కరన్ సినిమాతో తెరంగేట్రం చేసిన మమితా 7 ఏళ్లలో 15 సినిమాల దాకా చేసింది. ఐతే అన్ని సినిమాలు ఒక లెక్క అయితే అమ్మడికి ప్రేమలు తెచ్చిన పాపులారిటీ మరో లెక్క అని చెప్పొచ్చు. ఈ ఇయర్ మొదట్లో రిలీజైన ప్రేమలు సినిమా మలయాళంలో సూపర్ హిట్ కాగా దాన్ని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు. ఆ సినిమా రిలీజైన దగ్గర నుంచి సౌత్ ఆడియన్స్ కు మమితా బైజు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది.

ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అంతా కూడా మమితా నామ జపాన్ని చేస్తున్నారు అంటే అమ్మడు వారిని ఎంత డిస్ట్రబ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రేమలుతో సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మమితా ఆ క్రేజ్ తోనే తమిళంలో వరుస ఛాన్సులు అందుకుంటుంది. తెలుగులో సరైన కథ కోసం ఎదురుచూస్తుంది అమ్మడు. కోలీవుడ్ లో ఆల్రెడీ ఈ ఇయర్ రెబల్ సినిమా చేసిన మమితా బైజు ప్రస్తుతం విష్ణు విశాల్ తో ఒక సినిమా చేస్తుంది. అంతేకాదు దళపతి విజయ్ 69వ సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసింది.

చేస్తున్న పాత్రల్లో నటిగా తన అభినయంతో మెప్పిస్తున్న మమితా బైజు తన సినిమాలే కాదు ఫోటో షూట్స్ తో కూడా వారెవా అనిపించేస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు వైట్ కలర్ శారీ తో ట్రెడిషనల్ లుక్ తో అదరగొట్టేస్తుంది. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న మమితా బైజు కుర్రాళ్లను డిస్ట్రబ్ చేయడమే తన టార్గెట్ గా పెట్టుకుందని చెప్పొచ్చు. ఆమె ఫోటో షూట్ చూసిన ఎవరైనా సరే ఈ మళయాళ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అనేలా కామెంట్స్ చేస్తారు.

సౌత్ అంతా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న మమితా టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తిగా ఉంది. ఐతే ఆమె ఎలాంటి సినిమాతో తెలుగు పరిచయం అవుతుంది అన్నది ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తుంది. అసలైతే ఒక మంచి లవ్ స్టోరీతో వస్తే మాత్రం తెలుగులో అమ్మడికి కచ్చితంగా అదిరిపోయే వెల్కం ఇస్తారని తెలుస్తుంది.

మమితా కూడా వచ్చిన ప్రతి సినిమా చేసేద్దాం అన్నట్టు కాకుండా పాత్ర ప్రాధాన్యతను బట్టే సినిమాలను ఓకే చేస్తుంది. టాలీవుడ్ లో అసలైతే విజయ్ దేవరకొండ సినిమాలో మమితా నటిస్తుంది అన్న డిస్కషన్ అయితే వచ్చింది కానీ అది అఫీషియల్ గా మాత్రం బయటకు రాలేదు. ఎప్పుడొచ్చినా సరే తెలుగు ఆడియన్స్ మమితాను తమ హృదయాల్లో దాచుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు.

Tags:    

Similar News