ప్రేమలు మమిత చీరలో ఎంత అందమో..!
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కంటే ఎక్కువగా ఉత్తరాది ముద్దుగుమ్మలు, మలయాళ ముద్దుగుమ్మలు ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కంటే ఎక్కువగా ఉత్తరాది ముద్దుగుమ్మలు, మలయాళ ముద్దుగుమ్మలు ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేరళ నుంచి ఇప్పటికే ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా పరిచయం అయ్యారు. ఎక్కువ శాతం మంది మలయాళం సినిమాలతోనే బిజీగా ఉంటే కొందరు మాత్రం తమిళం ఇంకా తెలుగు భాషల్లో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల తెలుగు ప్రేక్షకులకు కూడా అభిమాన తార అయిన ముద్దుగుమ్మ మమిత బైజు. ఈమె మలయాళ సినిమా ప్రేమలు డబ్బింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ప్రేమలు తెలుగు వర్షన్ రిలీజ్ సమయంలో హైదరాబాద్ లో పలు మీడియా సమావేశాలకు హాజరు అయిన మమిత మరింత ప్రేక్షకులకు చేరువ అయ్యే ప్రయత్నం చేసింది. ప్రేమలు సినిమాలో ఈ అమ్మడు ప్రదర్శించిన నటనకు తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఫిదా అయ్యారు. అందుకే టాలీవుడ్ లో ఈమెను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రేమలు విడుదల అయిన సమయంలోనే ఒక టాలీవుడ్ యంగ్ హీరోకు జోడీగా మమిత బైజును సంప్రదించారనే వార్తలు వచ్చాయి.
ఎక్కువ స్కిన్ షో చేయకుండానే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి చీర కట్టుతో మమిత చూపు తిప్పుకోనివ్వడం లేదు. తెలుపు రంగు చీర కట్టి అందమైన హెయిర్ డ్రెస్ తో కవ్వించే విధంగా చూస్తున్న మమిత బైజు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో అందంగా ఉన్న మమిత కు టాలీవుడ్ లో ఒక్క హిట్ పడితే కచ్చితంగా చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు ఇంకా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మమిత బైజు 2017 లో మలయాళ మూవీ సర్వోపరి పాలక్కారన్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మలయాళ ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకుంది. ఖో ఖో సినిమా లో ఉత్తమ నటనకు గాను కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్ ను సైతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేస్తూనే సినిమాల్లో నటిస్తున్నట్లుగా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో తెలుగు, హిందీ భాషల నుంచి ఆఫర్లు వస్తే తప్పకుండా చేస్తానంటూ ఒక చిట్ చాట్ లో చెప్పుకొచ్చింది.