ప్రేమలు పిల్ల మరో జాక్ పాట్

మలయాళంలో ప్రేమలు సినిమాలో హీరోయిన్ గా నటించిన మమిత బైజుని అంత ఈజీగా ఎవరు మరిచిపోరు.

Update: 2024-08-05 15:30 GMT

మలయాళంలో ప్రేమలు సినిమాలో హీరోయిన్ గా నటించిన మమిత బైజుని అంత ఈజీగా ఎవరు మరిచిపోరు. ప్రేమలు చిత్రంలో మమిత పెర్ఫార్మెన్స్, స్మైల్ కి కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్ అయిపోయారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషలలో కూడా డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యింది. తెలుగులో కూడా ప్రేమలు సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీని తర్వాత మమితకి టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయని అందరూ భావించారు.

అయితే అంతకంటే ముందుగా కోలీవుడ్ లో మమిత బైజు అడుగుపెట్టింది. జీవీ ప్రకాష్ కుమార్ కి జోడీగా రెబల్ సినిమాలో మమిత నటించింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కొన్ని నెలల క్రితం విష్ణు విశాల్, అరుణ్ విజయ్ కాంబినేషన్ లో స్టార్ట్ అయిన మల్టీ స్టారర్ చిత్రానికి మమిత బైజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో మమిత బైజు అవకాశం సొంతం చేసుకుందంట.

ఇళయదళపతి విజయ్ హీరోగా 69వ సినిమా ఇప్పటికే హెచ్ వినోత్ దర్శకత్వంలో కన్ఫర్మ్ అయ్యింది. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ నడుస్తుందంట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో దళపతి సిస్టర్ పాత్ర కోసం మమిత బైజుని కన్ఫర్మ్ చేసారంట. ఇప్పుడు కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. అయితే స్టార్ హీరోయిన్ కావాల్సిన బ్యూటీని సిస్టర్ రోల్ కోసం తీసుకోవడం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది.

ఈ మూవీలో ఆమె పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుందంట. ఈ కారణంగానే మమిత బైజుని ఎంపిక చేసినట్లు ప్రచారం నడుస్తోంది. విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో GOAT సినిమా చేస్తున్నాడు. దీని నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక దీని తర్వాత హెచ్ వినోత్ దర్శకత్వంలో సినిమాని విజయ్ స్టార్ట్ చేస్తాడనే మాట వినిపిస్తోంది.

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ఉండబోతుందంట. ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందంట. మరో వైపు మమిత బైజుకి తెలుగులో కూడా ఆఫర్స్ వస్తున్నాయంట. ఓ పెద్ద ప్రొడక్షన్ ద్వారా ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. మమిత ఫ్యాన్స్ కూడా ఆమె తెలుగు ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News