అక్కతో మంచు మనోజ్.. వెరీ ఎమోషనల్..
ఈ క్రమంలో మంచు లక్ష్మి ఫ్యామిలీ గొడవలకు దూరంగానే ఉంది. ఇక ఆమె ఎవరికి మద్దతు ఇస్తున్నారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా ఒక వీడియో వైరల్ గా మారింది.;

ఈమధ్య కాలంలో మంచు వారి ఫ్యామిలీలో పలు వివాదాలు హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. మంచు మనోజ్ సోదరుడిపై అలాగే తండ్రి విషయంలో పలు రకాల కామెంట్స్ చేయడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. ఈ క్రమంలో మంచు లక్ష్మి ఫ్యామిలీ గొడవలకు దూరంగానే ఉంది. ఇక ఆమె ఎవరికి మద్దతు ఇస్తున్నారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా ఒక వీడియో వైరల్ గా మారింది.
ఓ ఈవెంట్ వేదిక.. వెలుగులతో మెరిసిపోయే స్టేజ్, వెనుక నుంచి మెల్లిగా అక్కను ఆప్యాయంగా పట్టుకున్నాడు మనోజ్.. అంతలో మంచు లక్ష్మి ఎవరా.. అని వెనక్కి తిరిగి చూసింది. ఇక తమ్ముడిని అలా చూడగానే మంచు లక్ష్మి కంటతడి పెట్టి, అతడిని బలంగా హత్తుకుంటున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోల్లో కనిపిస్తున్న మూడో వ్యక్తి మాత్రం ఎవరో కాదు.. భూమా మౌనిక.
ఈ వీడియోలో కనిపించిన భావోద్వేగాలు అభిమానుల గుండెను హత్తుకుంటున్నాయి. ఇటీవలే మౌనిక తన పెళ్లిరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ కు మంచు లక్ష్మి చేసిన కామెంట్ కు కూడా మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో ఈవెంట్ లో లక్ష్మి మోకాలిపై కూర్చుని కంటతడి పెట్టిన దృశ్యం ఒక గొప్ప కుటుంబ ప్రేమకు అద్దం పడుతోంది.
ఇదే సమయంలో మంచు మనోజ్ తన సోదరికి తన మద్దతు తెలుపుతూ ఆమెను బలంగా హత్తుకుని, ప్రేమగా అభినందించడం చూసినవారంతా 'ఇది కదా ఫ్యామిలీ ఎమోషన్' అని కామెంట్ చేస్తున్నారు. ఇటీవల మనోజ్-లక్ష్మి మధ్య స్నేహబంధం దూరమైంది అన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇది హార్ట్ఫుల్స్ వీడియోగా మారింది.
ఇక మరోవైపు మనోజ్ సినిమాలతో బిజీ అవుతున్న విషయం తెలిసిందే. భైరవం సినిమాలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇక మరోవైపు తేజ సజ్జ హీరోగా చేస్తున్న మిరాయ్ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో మనోజ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేలా కెరీర్ ను సెట్ చేసుకుంటున్నాడు. మరి ఈ సినిమాలు అతనికి ఎలాంటి క్రేజ్ ని తీసుకు వస్తాయో చూడాలి.