కుమార్తె దేవసేన బర్త్ డే.. మంచు మనోజ్ ఎమోషనల్
మనోజ్ - మౌనిక జంటకు గత ఏడాది పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఈ చిన్నారికి దేవసేన శోభా అని నామకరణం చేసింది ఈ జంట.;

సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో మంచు మనోజ్ ప్రత్యేకమైనవాడు. ఆలోచనల పరంగాను విలక్షణమైనవాడు. అతడు తన వ్యక్తిగత జీవిత పోరాటంలో సాహసాలతోనే ముందుకు సాగుతున్నాడు. అప్పటికే ఒక బిడ్డకు తల్లి, మొదటి భర్త నుంచి విడిపోయిన తన స్నేహితురాలు భూమా మౌనిక రెడ్డిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. మౌనిక రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన యువతి. భూమా నాగిరెడ్డి- శోభా నాగిరెడ్డిల వారసత్వాన్ని అందిపుచ్చుకుని ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

మనోజ్ - మౌనిక జంటకు గత ఏడాది పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఈ చిన్నారికి దేవసేన శోభా అని నామకరణం చేసింది ఈ జంట. ఈ పేరులోని 'దేవసేన' మనోజ్ ఆరాధ్య దైవం సుబ్రమణ్య స్వామి సతీమణి పేరు. అలాగే 'శోభ' మనోజ్ అత్తగారు దివంగత శోభా నాగిరెడ్డి పేరు. ఈ రెండు పదాలను కలిపి కుమార్తెకు పేరు పెట్టుకున్నారు. దేవసేన శోభ నేడు మొదటి పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్బంగా పాపా మనోజ్ సోషల్ మీడియాల్లో ఎమోషనల్ నోట్ రాసారు.
''ఒక సంవత్సరం క్రితం, మన ప్రపంచం మరింత మాయాజాలంగా మారింది. మేము ముగ్గురం నలుగురం అయ్యాము. నాలుగు హృదయాలు. నాలుగు ఆత్మలు. ఒక అచంచలమైన బంధం. నాలుగు స్తంభాలు నిటారుగా నిలబడి ఉన్నాయి. ప్రేమ, బలం .. శాశ్వతంగా నిర్మించిన కుటుంబం..'' అని రాసాడు.
''దేవసేన శోభా, మా MM పులి (కుమారుడు) .. మీరు మా జీవితాల్లోకి కాంతి, ధైర్యం అనంతమైన ఆనందాన్ని తీసుకువచ్చారు. ఈ జీవితం మీకు బెస్ట్ అందించాలని మాత్రమే కోరుకుంటున్నాను. అమ్మ, నేను, ధైరవ్ అన్నా ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షిస్తాము. ఆరోగ్యం, అందమైన కలలతో నిండిన జీవితాన్ని కలిసి నిర్మించుకుందాం. మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మా సింహరాశి. పదాలు ఎప్పటికీ దొరకనంతగా మేము నిన్ను ప్రేమిస్తున్నాము' అని మంచు మనోజ్ రాసాడు. వన్ ఇయర్ ఆఫ్ మ్యాజిక్.. అవర్ లిటిల్ లయనెస్ అంటూ హ్యాష్ ట్యాగుల్ని జోడించాడు. మనోజ్ షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ లో బర్త్ డే బేబి దేవసేన ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.