అమ్మ నిర్మలాదేవిని తలచి మనోజ్ ఎమోషనల్ పోస్ట్
తాజాగా మనోజ్ నుంచి 'ఎక్స్'లో రెండు ట్వీట్లు ఆసక్తికర చర్చకు తెర తీసాయి. వీటిలో తన తల్లి శ్రీమతి నిర్మాలా దేవి మంచు గురించి మనోజ్ ఎమోషనల్ ట్వీట్ చేసారు.
ఓవైపు మంచు కుటుంబంలో తండ్రి కొడుకుల గొడవ రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు - మంచు మనోజ్ మధ్య గొడవ చిలవలుపలువలుగా మీడియాలో ప్రచారమైంది. ఇంతలోనే మనోజ్ మూవీ షూటింగ్‌లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం 'భైరవం' చిత్రీకరణలో మనోజ్ పాల్గొంటున్నారని సమాచారం. ఈ చిత్రంలో మనోజ్‌తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. దివ్య పిళ్లై, ఆనంది, అదితి శంకర్ కథానాయికలు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. మనోజ్ చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రమిది.
తాజాగా మనోజ్ నుంచి 'ఎక్స్'లో రెండు ట్వీట్లు ఆసక్తికర చర్చకు తెర తీసాయి. వీటిలో తన తల్లి శ్రీమతి నిర్మాలా దేవి మంచు గురించి మనోజ్ ఎమోషనల్ ట్వీట్ చేసారు. ''పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా.. మన కుటుంబానికి హృదయానివి.. ఆత్మవు నువ్వు. నీ ప్రేమ దయ మమ్మల్ని ఎన్ని కష్టాలు వచ్చినా కలిపి ఉంచింది. నీ ధైర్యం ప్రతిరోజు నాలో స్ఫూర్తి నింపుతుంది. ప్రపంచంలోని శాంతి ప్రేమ సంతోషం అన్నీ నీకు దక్కాలని కోరుకుంటున్నాను. ఏం జరిగినా ఎప్పుడూ నీతోనే ఉంటాను'' అంటూ మనోజ్ ట్వీట్ చేసారు.
మరోవైపు స్టార్ హీరో అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజైన తర్వాత అతడినుద్ధేశించి మనోజ్ చేసిన ట్వీట్ చర్చగా మారింది. మనోజ్ ట్వీట్ సారాంశం ఇలా ఉంది. ''మొత్తం దిష్టి అంతా పోయింది బాబాయ్.. వెల్కమ్ బ్యాక్ అల్లు అర్జున్ గారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మీరు కనబరిచిన ప్రశాంతత, బాధ్యతయుత వ్యవహారశైలిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తానని మీరు ఇచ్చిన హామీ మీ నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది'' అంటూ రాసుకొచ్చారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన నిజంగా హృదయ విదారకం. భద్రతకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? పక్కవారి పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసిందని కూడా మనోజ్ తన ట్వీట్ లో రాసారు. అల్లు కుటుంబానికి సంతోషం కలగాలని ఆకాంక్షించారు.