ప్రాణహాని ఉందంటూ మనోజ్ ఫిర్యాదు... ఎవరు ఆ 10 మంది?

మంచు ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కిందనే చర్చకు బలం చేకూర్చే కీలక పరిణామం తెరపైకి వచ్చింది.

Update: 2024-12-09 18:09 GMT

మంచు ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కిందనే చర్చకు బలం చేకూర్చే కీలక పరిణామం తెరపైకి వచ్చింది. ఆదివారం ఉదయం నుంచి ఈ వ్యవహారంపై రకరకాల కథనాలు ప్రసారం అవుతున్న వేళ.. వాటిలో స్పష్టత కరువైందనే చర్చా జరిగింది. అయితే ఆదివారం సాయంత్రం మంచు మనోజ్ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచీ ప్రచారానికి బలం చేకూరుతు వస్తోందని అంటున్నారు.

ప్రధానంగా మనోజ్ ఆదివారం సాయంత్రం ఆస్పత్రికి రావడం.. ఆ సమయంలో ఆయన నడవలేని స్థితిలో ఉన్నట్లు కనిపించడం.. వంటివి జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చాయనే చర్చా నడిచింది. ఇక సోమవారం ఉదయం ఆయన మెడికో లీగల్ రిపోర్ట్ తెరపైకి రావడం.. అందులో ఆయనకు కడుపు, వెన్నెముకలో గాయాలైనట్లు తెలియడంతో ఇక.. జరుగుతున్న ప్రచారానికి మరింత బలం తోడయ్యిందనే కామెంట్లు వినిపించాయి.

మరోపక్క విష్ణు 40 మంది బౌన్సర్లను ఏర్పాటు చేశారంటే.. మనోజ్ 30 మందిని అరేంజ్ చేశారని.. వారిలో విష్ణు బౌన్సర్ లను మాత్రమే మోహన్ బాబు ఇంటిలోనికి అనుమతించారని కథనాలొచ్చాయి. మరోవైపు ఈ ఎపిసోడ్ లోకి మంచు లక్ష్మి ఎంట్రీ ఇచ్చారంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ కథనాలు ప్రసారమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందంటూ మనోజ్ ఫిర్యాదు చేశారు.

అవును... మోహన్ బాబు కుటుంబంలో వివాదం నడుస్తుందంటూ ఆదివారం ఉదయం నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి బలం చేకూర్చే ఘటనలు ఆదివారం సాయంత్రం నుంచి స్టార్ట్ అయ్యాయని అంటున్నారు! ఈ నేపథ్యంలో తాజా అప్ డేట్ ప్రకారం... మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఇందులో భాగంగా.. తన నివాసానికి వచ్చి పది మంది దుండగులు దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అయితే.. మంచు కుటుంబం గురించి కానీ, మోహన్ బాబు గురించి కానీ ఆ ఫిర్యాదులో ఏమీ మెన్షన్ చేయలేదని.. అంటున్నారు. తనపై దాడి జరిగిన సమయంలో విజయ్, కిరణ్ అనే వ్యక్తులు వచ్చి సీసీ టీవీ ఫుటేజ్ మాయం చేసినట్లు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెబుతున్నారు.

దీనిపై స్పందించిన సీఐ... పీఎస్ కు వచ్చిన మంచు మనోజ్ ఆదివారం తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసినట్లు చెప్పారని తెలుస్తోంది. 10 మంది అగంతకులు తనపై దాడికి పాల్పడ్డారని.. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారని అంటున్నారు. ఈ మేరకు మనోజ్ స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తామని పోలీసులు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో... అసలు మంచు ఫ్యామిలీలో ఏమి జరుగుతుంది అనే చర్చ మరింత బలంగా నడుస్తోంది!

Tags:    

Similar News