ఆస్తి గొడవలు కాదు.. పెట్స్ కోసమే వచ్చా: మనోజ్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. తన తండ్రి మోహన్ బాబు ఇంటి వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.;

Update: 2025-04-09 10:16 GMT
ఆస్తి గొడవలు కాదు.. పెట్స్ కోసమే వచ్చా: మనోజ్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. తన తండ్రి మోహన్ బాబు ఇంటి వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం జల్ పల్లిలోని నివాసం వద్దకు చేరుకున్న మనోజ్.. ఇంట్లోకి వెళ్లేందుకు ట్రై చేశారు. కానీ గేటు తెరవకపోవడంతో బయటే బైఠాయించి నిరసన తెలిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు మనోజ్.

అయితే తమ కుటుంబంలో జరుగుతున్నవి ఆస్తి గొడవలు కాదని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అంతా జరుగుతుందని అన్నారు. తన జుట్టు విష్ణు చేతుల్లోకి ఇచ్చేందుకు అలా చేస్తున్నారని ఆరోపించారు. గత ఏడాది డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతున్నాయని, కానీ పోలీసులు ఇప్పటివరకు ఒక్క ఛార్జీషీట్ ఫైల్ చేయలేదన్నారు.

"మాపై దాడి చేసేందుకు కత్తులతో వచ్చారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు సమర్పించాను. ఏదేమైనా ఇంట్లో నా వస్తువులు ఉన్నాయి. పెంపుడు జంతువులు ఉన్నాయి. నేను వచ్చింది వాటి కోసమే. నా కూతురు బర్త్ డే కోసం జైపుర్ వెళ్లాం. ఇంతలో విష్ణు ప్లాన్ చేసి.. తెల్లవారుజామున అనుచరులతో వచ్చి కార్లు ఎత్తుకెళ్లారు" అని చెప్పారు.

"కమిషనర్ జారీ చేసిన బైండోవర్ ను ఎన్నోసార్లు క్రాస్ చేసేశారు. నేను ఒక్క తప్పు చేశానని ప్రూవ్ చేయమనండి. వెంటనే సారీ చెబుతా. పోలీసులకు చోరీ జరిగిందని చెప్పినా పట్టించుకోవడం లేదు. యాక్షన్ తీసుకోవడం లేదు. అందుకే తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ కు విన్నవిస్తున్నా. నా సమస్య క్లియర్ చేయండి. లోపలకు నన్ను రప్పించడం లేదు" అని చెప్పారు.

"ఇప్పటి వరకు నా ఫ్యామిలీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. వేరే నిర్మాతలతో చేసిన సినిమాలు హిట్ అయితే.. నన్ను తీసుకొచ్చారు. సొంత బ్యానర్ లో మూవీ చేయాలని అనేవారు. విష్ణు మూవీ కెరీర్ కోసం లేడీ గెటప్ వేశాను. వాళ్లందరి కోసం ఎంతో కష్టపడ్డా.. గొడ్డు చాకిరీ కూడా చేశాను" అని మనోజ్ చెప్పారు.

"కన్నప్ప మూవీకి పోటీగా భైరవం మూవీను రిలీజ్ చేద్దామని అనుకున్నాం. అది తెలిసి కన్నప్ప మూవీ వెంటనే వాయిదా వేశారు. అందుకే అది తట్టుకోలేక ఇప్పుడు ఏదో ఏదో చేస్తున్నాడు. ఎందుకు ఇలా దిగజారుతున్నాడో తెలియడం లేదు. అస్సలు ఎలాంటి తలనొప్పులు లేకుండా కూర్చుని మాట్లాడుకుంటే బెటర్" అని అన్నారు మనోజ్.


Tags:    

Similar News