లీకైన వీడియో వైరల్... మనోజ్ స్ట్రాంగ్ రియాక్షన్!

ఇక అంత కూర్చుని మాట్లాడుకుంటారు అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఓ వీడియో లీకైంది!

Update: 2024-12-14 09:50 GMT

మంచు ఫ్యామిలీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి జరిగిన రచ్చ అనంతరం బుధ, గురువారాల్లో కాస్త ప్రశాంతమైన వాతావరణమే కనిపించిన పరిస్థితి. దీంతో.. అంత సద్దుమణిగినట్లుంది.. ఇక అంత కూర్చుని మాట్లాడుకుంటారు అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఓ వీడియో లీకైంది!

ఈ వీడియోలో మంచు మనోజ్ దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు.. కూర్చుని మాట్లాడుకోమని సలహా ఇస్తున్న వ్యక్తిని దుషించినట్లుగా ఉంది! దీంతో... ఈ ఎపిసోడ్ మొత్తం మీద మంచు మనోజ్ పై అటు మీడియాలోనూ, ఇటు ప్రజల్లోనూ సానుభూతి పెరుగుందనే చర్చ నేపథ్యంలో.. బురదజల్లడం కోసమే ఈ వీడియో విడుదల చేసినట్లున్నారనే చర్చ జరిగింది. దీనిపై మనోజ్ స్పందించారు.

అవును... మంగళవారం రాత్రి మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటన సమయంలో మంచు మనోజ్ దురుసుగా ప్రవరిస్తూ కనిపించిన ఓ వీడియో విడుదలైంది. ఆ వీడియోను ఎవరు విడుదల చేశారనే విషయం తెలియనప్పటికీ... దీనిపై రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో స్పందించిన మనోజ్.. దీనిపై స్పష్టత ఇచ్చారు.

ఇందులో భాగంగా... డీజీపీ ఆఫీసుకు వెళ్లిన తర్వాత జరిగిన ఒక బాధాకరమైన సంఘటనను అందరితో పంచుకోవాలనుకుంటున్నట్లు మొదలుపెట్టిన మనోజ్.. దానివల్ల తాను, తన భార్య ఎంతో కుమిలిపోయినట్లు తెలిపారు. తమ 9 నెలల కుమార్తెను ఇంట్లో బంధించి మమ్మల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని మనోజ్ తెలిపారు.

ఆ సమయంలో బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన తమపై దాడులకు పాల్పడ్డారని.. నన్ను కొట్టారని.. ఆ ఘర్షణలోనే తన చొక్కా చిరిగిందని.. నిస్సహాయతకు లోనై, ఏమి చేయ్యలో తెలియక మీడియాను సంప్రదించినట్లు మనోజ్ తెలిపారు. ఈ సందర్భంగా... మీడియాను పిలిచింది తానే అని.. ఇంటి ఆవరణలోకి రావడంలో వాళ్ల తప్పేమీ లేదని అన్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా లికైన వీడియోపై మాట్లాడుతూ.. దీనికి సంబంధించిన పూర్తి వీడియో విడుదల చేయాలంటూ విష్ణు పార్టర్నర్ రాజ్ ను కోరుతున్నట్లు మనోజ్ తెలిపారు. విచారణ కొనసాగనివ్వాలని.. నిజానిజాలు బయటకు వచ్చేవరకూ వేచి ఉండాలని ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా మనోజ్ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News