కన్నప్ప: అక్షయ్ ఇలా.. ప్రభాస్ అలా..

టాలీవుడ్ హీరో మంచు విష్ణు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా మూవీ కన్నప్పను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-02-28 07:01 GMT

టాలీవుడ్ హీరో మంచు విష్ణు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా మూవీ కన్నప్పను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాతో ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానుంది. మూవీలో భారీ తారాగణం కూడా నటిస్తోంది.

మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, మధుబాల, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ వంటి పలువురు స్టార్ నటీనటులు.. కన్పప్పలో భాగమయ్యారు. ప్రత్యేక పాత్రల్లో సందడి చేయనున్నారు. వారితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కూడా కన్నప్పలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే వారిద్దరి ఫస్ట్ లుక్స్ రిలీజ్ అవ్వగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో ఈవెంట్స్‌ తో ఇప్పటికే ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. తాజాగా ముంబైలో సినిమా ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఆ సమయంలో అక్షయ్ కుమార్, ప్రభాస్ గురించి మంచు విష్ణు మాట్లాడారు. వారిద్దరూ మూవీలో నటించే విషయాన్ని ప్రస్తావించారు.

కన్నప్పలో నటించేందుకు ప్రభాస్ అస్సలు ఆలోచించలేదని తెలిపారు మంచు విష్ణు. నాన్న గారు సినిమా చేయమని అడిగినందుకు భయపడ్డాడని అన్నారు. ఆయన ఎందుకు కాల్ చేయలేదని క్వశ్చన్ చేశాడని పేర్కొన్నారు. మరోవైపు, అక్షయ్ కుమార్.. తన ఆఫర్ ను రెండు సార్లు రిజెక్ట్ చేశారని చెప్పారు. చివరకు ఒప్పించానని అన్నారు.

తన దృష్టిలో శివుడి రోల్ అంటే అక్షయ్ కుమారేనని తెలిపారు విష్ణు. భక్తి, దైవిక శక్తితో నిండిన కన్నప్ప కథ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరుతుందని నమ్ముతున్నట్లు చెప్పారు. మార్చి 1న టీజర్‌ ను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 25న పాన్ ఇండియా లెవెల్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని అన్నారు.

అదే సమయంలో కన్నప్పలో శివుడి పాత్ర చేసేందుకు ముందు రిజెక్ట్ చేశానని అక్షయ్ కుమార్ తెలిపారు. కానీ తానే సరిపోతానని విష్ణు నచ్చజెప్పటంతో అంగీకరించానని చెప్పారు. తన పాత్రకు తానే సరిపోతానని విష్ణు అనుకున్న విధానం.. అంగీకరించేలా చేసిందని ఆయన వెల్లడించారు. తెలిపారు. కన్నప్ప సినిమా స్టోరీ చాలా పవర్‌ఫుల్ అని అక్షయ్ కొనియాడారు. విజువల్స్ అద్భుతంగా ఉంటాయని చెప్పారు. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News