స్పిరిట్ లో పాత్ర కోసం అప్లై చేసుకున్న మంచు విష్ణు

ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు రెండు నిమిషాల వీడియోతో పాటూ వారి ఫోటోల‌ను మెయిల్ చేయాల‌ని తెలిపారు. అయితే ఈ విష‌యంపై తాజాగా మంచు విష్ణు రెస్పాండ్ అయ్యాడు.

Update: 2025-02-15 13:00 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో స్పిరిట్ సినిమా రానున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ కోసం చిత్ర యూనిట్ క్యాస్టింగ్ కాల్ ను అనౌన్స్ చేసింది. వ‌య‌సుతో సంబంధం లేకుండా, పురుషులు స్త్రీలు అంద‌రికీ ఈ అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్టు నిర్మాణ సంస్థ భ‌ద్ర‌కాళి పిక్చర్స్ సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించింది.

ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు రెండు నిమిషాల వీడియోతో పాటూ వారి ఫోటోల‌ను మెయిల్ చేయాల‌ని తెలిపారు. అయితే ఈ విష‌యంపై తాజాగా మంచు విష్ణు రెస్పాండ్ అయ్యాడు. స్పిరిట్ క్యాస్టింగ్ కాల్ కు తాను కూడా అప్లై చేసుకున్నాన‌ని, వెయిట్ చేసి చూద్దాం ఏమ‌వుతుందో అని ట్వీట్ చేశాడు విష్ణు. దీంతో విష్ణు చేసిన పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది.

మ‌రి విష్ణు నిజంగానే స్పిరిట్ క్యాస్టింగ్ కోసం అప్లై చేశాడో లేక స‌ర‌దాగా అలా పోస్ట్ చేశాడో తెలియ‌దు కానీ దీనిపై నెటిజ‌న్లు మాత్రం ర‌క‌ర‌కాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొంత‌మంది విష్ణుకు ఈ విష‌యంలో ఆల్ ది బెస్ట్ చెప్తుంటే మ‌రికొంద‌రు మాత్రం నీ అప్లికేష‌న్ త‌ప్పకుండా రిజెక్ట్ అవుతుందిలే అని ఎప్ప‌టిలానే విష్ణు ని ట్రోల్ చేస్తున్నారు.

అయితే మంచు ఫ్యామిలీతో ప్ర‌భాస్ కు ఎంతో అనుబంధ‌మున్న విష‌యం తెలిసిందే. విష్ణు తండ్రి మోహ‌న్ బాబుతో పాన్ ఇండియా స్టార్ కు మంచి బాండింగ్ ఉంది. ప్ర‌భాస్, మోహ‌న్ బాబు చాలా స‌న్నిహితంగా ఉంటార‌నే విష‌యం ఇండ‌స్ట్రీలో అందరికీ తెలుసు. ప్ర‌భాస్ న‌టించిన బుజ్జిగాడు సినిమాలో మోహ‌న్ బాబు కీల‌క పాత్ర కూడా చేశాడు.

ఇక ఇప్పుడు తాజాగా మోహ‌న్ బాబు నిర్మిస్తున్న క‌న్న‌ప్ప సినిమాలో ప్ర‌భాస్ ఏకంగా గెస్ట్ రోల్ చేస్తున్నాడు. విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాలో ప్ర‌భాస్ రుద్ర అనే పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. అంతేకాదు, ఈ సినిమా కోసం ప్ర‌భాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యూన‌రేష‌న్ తీసుకోలేద‌ని స్వ‌యంగా విష్ణునే వెల్ల‌డించాడు. క‌న్న‌ప్ప‌లో ప్ర‌భాస్ న‌టించాడు కాబ‌ట్టి స్పిరిట్ లో విష్ణుకు ఏదైనా పాత్ర ఇస్తారేమో అని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags:    

Similar News