ముంబైలో కాక‌లు పుట్టిస్తున్న తెలుగు న‌టి బ‌ర్త్‌డే పార్టీ

ఇంతకీ ఎవ‌రా తెలుగు న‌టి? అంటే.. అది మ‌రెవ‌రో కాదు.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ న‌టి, హోస్ట్ కం నిర్మాత మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న గురించే ఇదంతా.

Update: 2024-10-06 16:30 GMT

అవును.. ముంబైలో తెలుగు న‌టి కాక‌లు పుట్టిస్తోంది. సెల‌బ్రిటీ ప్ర‌పంచం అంతా త‌న వైపే తిరిగి చూసేలా చేస్తోంది. గ‌త కొన్నేళ్లుగా ముంబైలోనే నివాసం ఉంటూ అక్కడ కెరీర్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న ప్ర‌ముఖ తెలుగు న‌టి స్పెష‌ల్ బ‌ర్త్ డే పార్టీ ఇప్పుడు తెలుగు మీడియా స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.


ఇంతకీ ఎవ‌రా తెలుగు న‌టి? అంటే.. అది మ‌రెవ‌రో కాదు.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ న‌టి, హోస్ట్ కం నిర్మాత మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న గురించే ఇదంతా. ఇటీవ‌ల ముంబైలో నివాసం ఉంటున్న ల‌క్ష్మీ మంచు అక్క‌డ త‌న స్నేహితుల‌తో ఎంతో కంఫ‌ర్ట్ గా ఉంద‌ని, ముంబై త‌న‌కు సొంత ఇల్లు లాగా ఉంద‌ని ప‌లుమార్లు వెల్ల‌డించారు. స్నేహితుల‌తో ఉంటే త‌న ఇంట్లో ఉన్న‌ట్టేన‌న్న భావ‌న‌ను క‌న‌బ‌రిచారు. దీంతో ముంబై స్నేహాలు త‌న‌కు బిగ్ రిలీఫ్ అని అంద‌ర‌కీ అర్థ‌మైంది.


ఇప్పుడు ముంబైలో లక్ష్మి మంచు పుట్టినరోజు పార్టీ నుంచి చిల్లింగ్ ఫోటోలు కొన్ని అంత‌ర్జాలంలోకి వ‌చ్చాయి. ఇందులో మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితా సేన్, ప్ర‌గ్య జైశ్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ ఆమె భ‌ర్త జాకీ భ‌గ్నానీ క‌నిపించారు. లక్ష్మీ మంచు ఈవెంట్లో స్టార్లు ప‌రిమితంగానే ఉన్నా కానీ హంగామా మాత్రం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. ఇప్పుడు ఈ వేడుక నుంచి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పార్టీలో షైనీ ఎరుపు రంగు ఆఫ్ షోల్డర్ దుస్తుల్లో ల‌క్ష్మీ మంచు ధ‌గ‌ధ‌గా మెరిసిపోగా, ర‌కుల్ సాధారణ డిజైనర్ దుస్తులను ధరించింది. సుస్మితా సేన్ లక్ష్మి మంచు క‌లిసి ఉన్న ఫోటోలు యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహాతో సెల‌బ్రేష‌న్ కి సంబంధించిన ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి.

లక్ష్మి మంచు అక్టోబర్ 8న తన పుట్టినరోజును జరుపుకుంటుంది. అయితే ఈ సంవత్సరం ముంబైలోని తన స్నేహితుల కోసం ముంద‌స్తుగా ప్ర‌త్యేక పార్టీని నిర్వహించినట్లు తెలుస్తోంది. ముంబై పార్టీలు ల‌క్ష్మీకి కొత్తేమీ కాదు. గతంలోను తన పుట్టినరోజు వేడుకలను ముంబైలో ఘనంగా జరుపుకుంది. అప్ప‌ట్లో శ్రీయా శరణ్, తాప్సీ పన్ను, సుస్మితా సేన్, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Tags:    

Similar News