వీడియో: వామ్మోవ్ మంచు లక్ష్మి సాహసం
సరసులోంచి బయటకి వస్తూ కిలకిలా నవ్వేసిన మంచు లక్ష్మి వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
వామ్మోవ్! ఇది ఎంతటి సాహసం. మైనస్ డిగ్రీల చలిలో.. మంచు గడ్డల్లోని నీటిలోకి దిగడం అంటే నిజంగానే చాలా గట్స్ కావాలి. కానీ తనకు అలాంటి గట్స్ ఉన్నాయని నిరూపించింది మంచు లక్ష్మి. మంచు ఖండం ఫిన్ ల్యాండ్ లోని ఒక ప్రత్యేకమైన నీటి సరస్సులోకి దిగి జలకాలాడుతూ మంచు లక్ష్మి కనిపించింది. ఇలా నీళ్లలోకి దిగిందో లేదో అలా వెంటనే తిరిగి సరస్సు నుంచి బయటపడింది. నవ్వేస్తూ చలికి గజగజ ఒణికింది కూడా. సరసులోంచి బయటకి వస్తూ కిలకిలా నవ్వేసిన మంచు లక్ష్మి వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
అలాంటి చోట ఇలాంటి సాహసాలను మంచు లక్ష్మి చాలా ఎంజాయ్ చేసిందనే భావిద్దాం. ఈ స్పెషల్ వీడియోని ఇన్ స్టా మాధ్యమంలో షేర్ చేసిన మంచు లక్ష్మి ``ఫ్రోజెన్ థ్రిల్, నో చిల్!`` అని క్యాప్షన్ ఇచ్చింది. క్రిప్టో థెరపీ.. ఫిన్ ల్యాండ్ డైరీస్ అంటూ హ్యాష్ ట్యాగుల్ని కూడా జోడించింది. దీనికి బ్యాక్ గ్రౌండ్ లో ఐస్ ఐస్ బేబి అంటూ మ్యూజిక్ ఎంతో యాప్ట్ గా ఉంది.
ఇంతకీ అది ఏ తటాకం? అక్కడికి ఎందుకు తారలంతా వెళుతున్నారు? ఆ నీటికి ఏదైనా ప్రత్యేకత ఉందా? అంటూ ఒక అభిమాని అమాయకంగా ప్రశ్నించాడు. ఇక ఈ వీడియోపై రకరకాల వల్గర్ కామెంట్లు పెడుతున్న నెటిజనులకు ఒక అభిమాని చీవాట్లు కూడా పెట్టాడు. సెలబ్రిటీలు.. వాళ్ల లైఫ్ వాళ్ల ఇష్టం. మనం ఒక కామెంట్ పెడితే వాళ్లు చూసి సంతోషపడేలా ఉండాలి గానీ బాధపెట్టకూడదు! అని క్లాస్ తీస్కున్నాడు. అంత గడ్డకట్టే నీటిలో కూడా గోదావరి పుస్కరాలు లాగా మునిగి లేచారు.. రియల్లీ గ్రేట్ అని ఒకరు ప్రశంసించారు కూడా. ``చూస్తుంటేనే చలేస్తోంది.. ఎలా అండీ అసలు గ్రేట్!`` అని పొగిడేశాడు ఒక అభిమాని. స్నో లక్ష్మి ఇన్ స్నో వాటర్ అంటూ ఒక అభిమాని సరదాగా వ్యాఖ్యానించారు.